English | Telugu

Prerana vs Vishnupriya:  ప్రేరణని వాయించేసిన నాగార్జున.. ‌ఇదేనా సంస్కారం!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాటి ఎపిసోడ్ లో.. ఎగ్స్ టాస్క్ లో గర్ల్ అంతా ఇరగదీశారని క్లాప్స్ కొడుతూ పొగిడేశాడు నాగార్జున. ‌ఇక మీ ఆటతీరుతో ప్రైజ్ మనీ ఐదు లక్షలు పెరిగిందంటూ నాగార్జున అన్నాడు.

ఇక ఆ తర్వాత ప్రేరణ అండ్ విష్ణు ఇద్దరూ నిలబడి మిగిలిన వాళ్లు కూర్చోండి అని నాగార్జున అన్నాడు. మొదటగా ప్రేరణా చెప్పాల్సింది ఏమైనా ఉందా అని నాగార్జున అడుగగా.. చాలా సర్.. నాకు స్టార్టింగ్ నుంచి యష్మీ నేను ఫ్రెండ్స్ అనుకున్నా.. అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం కాదు.. మాకు మాకు పెద్ద పర్సనల్ కనెక్షన్ లేదు.. నేను బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యింది విష్ణుతోనే. ఒక్క నామినేషనల్‌లో నాకు తెలియదు సెల్ఫీష్ అనే క్యారెక్టర్ కనిపించింది కాబట్టి నామినేషన్ వేశాను.. నాకు చాలా మార్పులు కనిపించాయి. చికెన్ టాస్క్‌లో అందరూ గేమ్ కోసం ఎంత ఇవ్వాలో అంత ఇచ్చినా విష్ణు మాత్రం నాకు మాత్రం కోపంతో ఆడింది అనిపించింది. హేట్‌తో కనిపించింది. చాలా మాటలు కూడా నాతో పెట్టుకుంటే ఇలా ఉంటది .. ఇన్‌డైరెక్ట్‌గా దగ్గరల్లో వస్తే కూడా విరగొట్టి పంపించేస్తా.. అండ్ ఒక పాయింట్‌లో ఇక్కడ నేను కూర్చున్నప్పుడు సీతా నన్నుపట్టుకుంది సోఫా మీద.. రెండు చేతులతో పట్టుకుంది. నేను సీతను ఎటాక్ చేయడం లేదంటూ ఇంకా చెప్పబోతుంటుంది.

ఇంతలో నాగార్జున వీడియో ప్లీజ్ అని.. మొత్తం చూపించాటు. ఇప్పుడు మాట్లాడమ్మా.. విష్ణు.. సీత టీమేనా కాదు? తను రావడంలో తప్పేంటని నాగార్జున అన్నాడు. తప్పని కాదు సర్.. తన ప్రవర్తనలో నా మీద హేట్ కనిపించింది. కొట్టడం రక్కడం చేస్తుంటే అని ప్రేరణ అంటుంటే.. లేదు సర్ విష్ణు కొట్టలేదని సీత అంటుంది. అమ్మా ప్రేరణ రాక్షసి అని మొదట అన్నది ఎవరు? క్యారెక్టర్ లెస్ అని మొదట అన్నది ఎవరని నాగార్జున అడుగగా.. నేనే సార్ రెండూ నేనే.. కానీ నా దృష్టిలో క్యారెక్టర్ లెస్ అనే పదం సొసైటీలో ఉన్న తప్పు పదం కాదు.. తను చాలా సెన్సిటివ్, నేను ఆలోచిస్తానని చెబుతూ వచ్చిందో ఆ లక్షణాలన్నీ మారడం చూసి.. ఆ క్యారెక్టర్ మారుతుందనే ఉద్దేశంతో అన్నానని ప్రేరణ చెప్పింది.

మాస్క్ వేసుకుంటే మాస్క్ వేసుకున్నావ్ అనొచ్చు కదా? ఫాల్స్ అయితే ఫాల్స్ అనొచ్చు కదా? ఫేక్ అంటే ఫేక్ అనొచ్చు. కానీ అమ్మా.. మీరిద్దరు పంపులు, కుళాయిలు దగ్గర కొట్టుకుంటారే అలా కొట్టుకుంటున్నారు. ఏమైపోతుంది మీ సంస్కారమంటు నాగార్జున తిట్టాడు. లేదు సర్ నేను తర్వాత కూడా విష్ణు దగ్గరకు వెళ్లి సారీ చెప్పాను. పిచ్చిదానిలా వాగేశాను.. సారీ సర్ మరోసారి ఇలా జరగదంటూ ప్రేరణ అంది. ఇక ఆ తర్వాత విష్ణుప్రియకి వార్నింగ్ ఇచ్చాడు. చూడు విష్ణూ.. పుణ్యస్త్రీ దగ్గర నీకు చెప్పాను.. ఇప్పుడు పతివ్రత వరకూ వచ్చావ్. ఏం మాట్లాడుతున్నావో చూసుకోమని హెచ్చరించారు నాగార్జున. ఇకనైనా వీరిద్దరి మధ్య గొడవ రాకుంటే బాగుంటుందని నాగార్జున అన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో మరి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.