English | Telugu

Eto Vellipoyindhi Manasu : భార్యకి సర్ ప్రైజ్ ఇచ్చిన భర్త.. మోస్ట్ హ్యాపీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -214 లో.....రామలక్ష్మి ఆలోచిస్తుంటే మాణిక్యం వచ్చి.. దేని గురించి ఆలోచిస్తున్నావని అంటాడు. ఆయనపై ఎటాక్ చేసింది ఇంట్లో వాళ్లే అని డౌట్ గాఉంది కానీ సాక్ష్యం లేకుండా ఎలా నిరూపిస్తామని రామలక్ష్మి అంటుంది. ఎటక్ చేసింది ఎవరో నేనే కనుక్కుంటా.. నాకు నీ హెల్ప్ కావాలని మాణిక్యాన్ని రామలక్ష్మి అడుగుతుంది. ఏదైనా చేస్తానని మాణిక్యం అంటాడు. ఎటాక్ చేసినా వాడిని చూసావా అని రామలక్ష్మి అడుగుతుంది. లేదు సిరి చూసి ఉంటుంది. తనని అడుగు అని మాణిక్యం సలహా ఇస్తాడు.

Brahmamudi : భార్య డ్రీమ్ కోసం ఆటో నడుపుతున్న భర్త.. అసలేం జరిగిందంటే! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -528 లో..... రాజ్ దగ్గరకి ఇందిరాదేవి వస్తుంది. ఏం చేస్తున్నావని అడుగుతుంది. కళాకృతికి డిజైన్స్ పంపిస్తున్నానని చెప్తాడు. అక్కడ కళావతి అని రాసావని ఇందిరాదేవి అంటుంది. కూరగాయలు తీసుకొని రా అని ఇందిరాదేవి అనగానే వెళ్లి కావ్యకి ఇవ్వు తానే తెస్తుందని రాజ్ అంటాడు. కనకం ఇంటికి వెళ్లి చెప్పాలా అని ఇందిరాదేవి అనగానే.. రాజ్ కి కావ్య లేదన్న విషయం గుర్తుకువస్తుంది. మరొక వైపు కావ్యతో రాజ్ గురించి మాట్లాడుతుంది కనకం. దాంతో నాకు వర్క్ ఉందని కావ్య టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది.