English | Telugu

నామినేషన్ లో‌ నబీల్ పాయింట్లకు సోనియాకి తడిసిపోయిందిగా!

బిగ్ బాస్ హౌస్ లో నాల్గవ వారం ఎవరు బయటకు వెళ్తారా అనే కీలకమైన నామినేషన్ ప్రక్రియ సోమవారం నాడు జరిగింది. ‌ఇక‌ ఇందులో నిఖిల్, పృథ్వీ, సోనియా ఓవైపు‌‌..‌మిగిలిన వాళ్ళంతా ఓ వైపు అన్నట్టుగా అనిపిస్తుంది.

హాస్ లో పృథ్వీ, నిఖిల్ లని సోనియా ఎలా వాడేసుకుంటుందో అందరికి తెలుసు.. అదే విషయం నామినేషన్ టైమ్ లో చాలామంది కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాలని వ్యక్తపరిచారు. సోనియాను నామినేట్ చేస్తూ వరుసగా తన పాయింట్ల్ అన్నీ క్లారిటీగా చెప్పాడు నబీల్. నేను సంచాలక్‌గా కన్ఫ్యూజ్ అయినవ్ అన్నావ్.. కానీ బెలూన్ టాస్కులో నువ్వు సంచాలక్ అయినప్పుడు.. అభయ్ తప్పు చేసినప్పుడు.. అక్కడే డిస్ క్వాలిఫై చేసి నిఖిల్‌ను విన్నర్ అని చెప్పేయాల్సింది.. అక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అయినవ్.. ఇదే ముక్క నాగ్ సర్ ముందు కూడా చెప్పినవ్ అని నబీల్ తన మొదటి పాయింట్ చెప్పాడు. నేను సంచాలక్ అయినప్పుడు.. రూల్ బుక్ అంతా గట్టిగా చదివి వచ్చి చేస్తుంటే నువ్వు ఏమన్నావ్.. చదువుకోండి ఫస్ట్.. అంటూ నాకేదో చదువు రాదన్నట్లు అన్నావ్.. అలానే నేను గేమ్ అంతా అయినప్పుడు అక్కడ కూర్చొంటే ఇదే కదా సంచాలక్ బయాస్డ్ (పక్షపాతం) అని ఏదో చెప్పినవ్.. పెద్ద లొల్లి పెట్టినవ్.. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు ఓ సంచాలక్‌గా.. నువ్వు గట్టి గట్టిగా చెబుతున్నావ్.. అందుకే నేను గట్టిగా సమాధానం ఇచ్చా.. అప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒకవైపు పృథ్వీ, మరోవైపు నిఖిల్ భాయ్ వచ్చి టోన్, టోన్ అంటూ నా మీదకి వచ్చారు.. నేను ఒక సంచాలక్‌గా నువ్వొక కంటెస్టెంట్‌గా మాట్లాడుతుంటే వాళ్లెందుకు మధ్యలో వస్తారు.. అట్లాంటి పొజిషన్‌లో ఉన్నప్పుడు నువ్వైనా చెప్పాలిగా వాళ్లకి అని నబీల్ అన్నాడు. మరి వాళ్లని వెనకాలికి ఎవరు తీసుకొచ్చినరు నువ్వు తెచ్చినవా అంటూ సోనియా ఏదో చెబుతుంటే.. నా పాయింట్ అయిపోని.. ఓఓ.. మేడమ్.. నువ్వు హైదరాబాద్ అంతా తిప్పి తీసుకురాకు.. నా పాయింట్ అయిపోని అంటూ నబీల్ అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడ నబీల్ చేసిన యాక్షన్‌కి యష్మీ తెగ నవ్వుకుంది. ఇక దీనికి అడ్డదిడ్డంగా వాదించింది సోనియా. నువ్వు రూల్ బుక్ బరాబర్ చదవలే.. చదివితే నువ్వు డిఫెండ్ చేసినప్పుడు కప్పేసి ఉండొద్దు అన్నావ్.. నువ్వు బయాస్‌డ్‌గా మీ టీమ్‌కి హెల్ప్ చేశావ్.. ఎక్స్‌క్యూజ్ మీ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్.. ఏం సంచాలక్ భయ్ నువ్వు.. అంటూ ఇష్టమొచ్చిట్లు మాట్లాడింది సోనియా. కానీ నబీల్ మాత్రం సోనియాకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా బాగా డీల్ చేశాడు. నబీల్ పాయింట్లకి సోనియా బిక్కమొహమేసింది. అసలు సోనియాకి డిఫెండ్ చేసుకోడానికి ఏ మాత్రం పాయుంట్లు లేక పదే పదే ' ఫెయిల్డ్ సంఛాలక్ ' అంటూ రిపీట్ చేసింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...