English | Telugu

Biggboss Buzz promo: బజ్ ఇంటర్వ్యూలో అభయ్ నవీన్ ఏం చెప్పాడంటే!

బిగ్ బాస్ సీజన్-8 లో ఇప్పటివరకు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఇక అభయ్ నవీన్ థర్డ్ వీక్ ఎలిమినేషన్ అయ్యాడు. ఇక బజ్ ఇంటర్వ్యూలో అభయ్ ఏం చెప్పాడో తెలుసుకోవాలని బిబి అభిమానులు ఆలోచిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ బజ్(Biggboss Buzz interview) కి సంబందించిన ప్రోమో రిలీజైంది. దీనిలో హౌస్ మేట్స్ కి సంబంధించిన బెలూన్లని ఉంచి ఒక్కొక్కరి గురించి చెప్పి బెలూన్లని పగులగొట్టాడు అభి‌.

బిగ్ బాస్ సీజన్-8 బజ్ (Buzz) ఇంటర్వ్యూలని అంబటి అర్జున్ చేస్తున్నాడు. ఇక అభయ్ కి కొన్ని ప్రశ్నలని సంధించాడు యాంకర్ అంబటి అర్జున్. నిన్ను చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తుంది.. కాన్ఫిడెన్స్ థ్రిల్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కిల్స్ అని యాంకర్ అంబటి అర్జున్ అన్నాడు. ఇప్పుడేమో‌ ఇంత జ్ఞానిలా మాట్లాడుతున్నావ్ లాస్ట్ మూడు రోజులు బిగ్ బాస్ గురించి ఎందుకు అంత ఫూలిష్ గా మాట్లాడావని యాంకర్ అడుగగా.. లోపన్నొళ్ళు జ్ఞానులు కాదు నేను అజ్ఞాని కాదని అభయ్ అన్నాడు. ఆడకుండా ఉండటం నీ స్ట్రాటజీనా? బిగ్ బాస్ ని తిట్టడం నీ స్ట్రాటజీనా అని యాంకర్ అడుగగా.. నేను ఆ మెంటాలిటితో ఉండుంటే వేరేలా ఉంటుండే అని అభి అన్నాడు.

నేను వెళ్ళిపోతాను సర్ .. తప్పు చేశాను అని నువ్వు చెప్పి ఉంటే ఆడియన్స్ లో‌ నువ్వు హీరో అయ్యేవాడివి అని యాంకర్ చెప్పగానే అభయ్ కి నోట మాట రాలేదు. సోనియా మీకు బయట పది సంవత్సరాల నుండి తెలుసు.. హౌస్ లో సోనియా ఫేకా ? రియాలా అని యాంకర్ అడుగగా.. అభయ్ ఆలోచనలో పడిపోయాడు. సోనియా ఫేక్ అని చెప్పాడా లేదా రియల్ అని చెప్పాడా అనే క్యూరియాసిటితో ఈ బజ్ ప్రోమోని వదిలారు బిబి టీమ్. మరి సోనియా ఫేక్ అని అనుకుంటున్నారా లేక రియల్ అని అనుకుంటున్నారా మీరే కామెంట్ చేయండి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...