English | Telugu

Eto Vellipoyindhi Manasu : ఊహకందని మలుపులతో ఎటో వెళ్లోపోయింది మనసు.. మాస్క్ వేసుకున్నది అతనే!

​స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -216 లో... సీతాకాంత్, రామలక్ష్మి కోసం మల్లెపువ్వులు తీసుకొని వస్తాడు. శ్రీలత వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు. వాళ్లకు తెలియకుండా తీసుకొని వెళ్ళాలని సీతాకాంత్ అనుకుంటాడు. అలా తీసుకొని వెళ్తుంటే అందరు చూస్తారు. ఆ తర్వాత బావగారు లుంగీ కట్టుకొని అక్క దగ్గరికి వెళ్తారంటూ శ్రీలతకి శ్రీవల్లి చెప్తుంది. రామలక్ష్మి, సీతకాంత్ లు హ్యాపీగా ఉన్నట్లు ఉహించుకుంటుంది. ఈసారి నా లేడీవిలన్ తెలివితో వాళ్ళని విడగొడుతానని శ్రీవల్లి అంటుంది. నువ్వేం చెయ్యనవసరం లేదు.. ఏం చెయ్యాలో నాకు తెలుసంటూ శ్రీలత అంటుంది.

Karthika Deepam2: బంధం తెంచుకున్న కార్తీక్.. బావే కావాలంటూ జ్యోత్స్న  ఫైట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీక దీపం2'( Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-165లో..  పరువు, మర్యాదల కోసం మనవరాలి జీవితాన్నే నాశనం చేశాడు ఈ పెద్దమనిషి అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న.. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావ్... దీన్ని ఇక్కడితో ఆపెయ్ అని దశరథ్ అంటాడు. ఏం తాత రెండు పెళ్లిళ్లు చేసుకుంటే పోని పరువు.. మావయ్య చేసుకుంటే పోయిందా అని జ్యోత్స్న అంటుంది. నా తండ్రిని ఇంత మాట అంటావా నిన్ను అంటూ జ్యోత్స్నని కొట్టడానికి చేయి ఎత్తుతాడు దశరథ్. వెంటనే శివన్నారాయణ ఆపుతాడు. ఏంట్రా ఇది.. ఈడొచ్చిన ఆడపిల్ల మీద చేయి వేసుకుంటావా.. అది ఆవేశంలో మాట్లాడుతుంటే నువ్వు కూడా ఆవేశపడితే ఎలా అని శివన్నారాయణ అంటాడు. ఆవేశం కాదు నాన్నా.. మనం అంతా ఆలోచించేది దీని కోసమే కదా.. అయినా దీనికి ఎందుకు అర్థం కావడం లేదని దశరథ్ అంటాడు

Brahmamudi:  కాపురాలు కూల్చే మీరుండగా అలాంటి ఆశలు పెట్టుకుంటానా.. అవార్డు కోసం పోటీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-530 లో.. రాజ్, సుభాష్, రుద్రాణి ఎక్స్ పో కోసం వస్తారు. ఇక అదే సమయంలో కావ్య కూడా వస్తుంది. ఇక కావ్యని చూసిన సుభాష్.. ఎలా ఉన్నావమ్మా అని పలకరిస్తాడు. ఎలా ఉంటుంది అన్నయ్యా.. కారులు పోయి కాలి నడకన వస్తుంది కదా అన్నయ్య.. రాతల రాజ్యాలను ఏలుతుంటే.. బుద్ధులు బూడిద గుప్పల మీదే ఉంటే ఎవరు ఏం చేస్తారని రుద్రాణి అంటుంది. ఇప్పుడు మీ గురించి మీరు ఎవరికి చెబుతున్నారని స్వప్న అంటుంది. కావ్య పదమ్మా అని సుభాష్ అనగానే.. ఎవరు పిలిచారంటా అని రాజ్ అంటాడు. ఈ బిల్డింగ్ ఎప్పుడు కొన్నారంటా అని కావ్య అనేసి.. తన అక్క స్వప్నతో మాట్లాడుతుంది. ఈ వంకతో మాటి మాటికి ఎదురుపడి మా రాజ్ మనసు మార్చెయ్యాలని చూస్తున్నావేమో.. వాడు ఎప్పటికి నిన్ను క్షమించే ప్రసక్తే లేదని రుద్రాణి అంటుంది. మీ ఆయన నిన్ను ఇప్పటికి క్షమించకుండా వదిలేసినట్లు.. అందరి కాపురాలు అలానే ఉంటాయా అత్తా అని స్వప్న అంటుంది.

Karthika Deepam2 : దీప చేసిన ఆ పనికి పెళ్ళి ఆగిపోయింది.. బంధం తెంచుకున్నట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -163 లో..... కావేరిని కాంచన ఇంటికి రప్పిస్తుంది. తనకి చీర ఇస్తుంది. ఆ తర్వాత బ్యాగ్ శ్రీధర్ కి ఇచ్చి.. ఏం చేసిన ఒప్పుకుంటానని అన్నారు కదా.. ఇక కావేరిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్లిపోండి అని కాంచన చెప్పగానే.. కావేరిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు శ్రీధర్. అతను వెళ్లిపోతుంటే కాంచన ఏడుస్తుంది. కార్తీక్ బాధపడతాడు. అక్కడున్నా దీప.. కాంచనకి దైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరొకవైపు స్వప్న, కాశీ లని దాస్ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆడపడుచు ఉంటే ఇప్పుడు మిమ్మల్ని సరదాగా ఆటపట్టించే వాళ్లని దాస్ అంటాడు. దీప వుంది కదా తను కాశీని సొంత తమ్ముడు లాగా చూస్తుందని స్వప్న అంటుంది.