English | Telugu
నిఖిల్ పోరాటం వృధా.. సోనియాపై సీత గెలుపు!
Updated : Sep 25, 2024
బిగ్‌బాస్ హౌస్‌లో కాంతార టీమ్‌కి కొత్త చీఫ్ ఎన్నిక జరిగింది. ఇందులో నిఖిల్ ఒంటరి పోరాటం చేశాడు. అయితే బిగ్ బాస్ పెట్టిన మెలికతో సోనియా ఛీఫ్ రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
బిగ్ బాస్ కొత్త చీఫ్ కోసం సరికొత్త గేమ్ ని పెట్టాడు. " రెండో చీఫ్‌ను ఎంచుకునే సమయం వచ్చింది.. దీనికి ఇప్పటికే చీఫ్ అయిన నిఖిల్ మినహా మిగిలిన ప్రతి సభ్యుడు పోటీదారుడే.. ఇందుకోసం హౌస్‌లో నిఖిల్ మినహా ఉన్న మిగిలిన 10 మంది బొమ్మలను టేబుల్‌పై ఉన్నాయి. వాటి ముందు ఒక సుత్తి కూడా ఉంది.. ముందుగా నిఖిల్ మీరు చీఫ్ కాబట్టి ఇందులో ఎవరు చీఫ్‌గా అనర్హులని భావిస్తే ఆ మొదటి సభ్యుడి బొమ్మను తగిన కారణాల చెప్పి పగలకొట్టండి " అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అలానే రేసు నుంచి తప్పుకున్న వారు కడా ఈసారి బజర్ మోగినప్పుడు నిఖిల్‌తో పాటు సుత్తి కోసం పోటీపడాలి. అయితే ఎవరైతే సుత్తిని ముందుగా పట్టుకుంటారో వారు సుత్తిని వేరేవాళ్ళకి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు.
ఇక బజర్ మోగింది. ముందుగా సుత్తిని నిఖిల్ తీసుకున్నాడు. ఆదిత్య బొమ్మను నిఖిల్ పగలగొడుతూ.. మీకు లీడర్ షిప్ క్వాలిటీస్ లేవు.. మొన్న ప్రేరణ-మణికంఠ మధ్య దోస ఇష్యూ జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నా మాట్లాడలేదంటూ నిఖిల్ చెప్పాడు. తర్వాత బజర్ మోగినప్పుడు నిఖిల్‌తో పోటీపడి సుత్తిని ఆదిత్య దక్కించుకున్నాడు. అది పృథ్వీ చేతికి ఇచ్చాడు ఆదిత్య. దీంతో మణికంఠను రేసు నుంచి తప్పిస్తూ బొమ్మ పగలగొట్టేశాడు పృథ్వీ. ఆ తర్వాత నిఖిల్ చేతికి సుత్తి దొరకగా.. ఈసారి సీతకి ఇచ్చాడు. దీంతో ఇప్పిటకే ఒకసారి చీఫ్ అయిన కారణంగా యష్మీని రేసు నుంచి తప్పించింది సీత. తర్వాత వెంటనే మరోసారి నిఖిల్‌కే సుత్తి దొరికింది. దీంతో ఈసారి సోనియాకి ఇచ్చాడు నిఖిల్. దీంతో నబీల్ బొమ్మ పగలగొట్టి తన రివెంజ్ తీర్చుకుంది సోనియా. మరోసారి నిఖిల్‌కే హ్యామర్ దొరికింది. ఈసారి నైనికకి ఇవ్వగా విష్ణుప్రియను రేసు నుంచి తప్పించింది. ఆ తర్వాతే అసలు గేమ్ మొదలైంది.
ఆ తర్వాత విష్ణుప్రియ, నిఖిల్ దాదాపు ఒకే టైమ్‌లో సుత్తి పట్టుకున్నారు. కానీ విష్ణుప్రియ మొదటగా పట్టుకుందని కాంతార టీమ్.. కాదు నిఖిల్ పట్టుకున్నాడంటూ సోనియా వాదించారు. అయిన సరే ఇద్దరూ వదలకపోవడంతో నిఖిల్ లాక్కునేందుకు ట్రై చేశాడు. దీంతో విష్ణుప్రియకి సపోర్ట్‌గా యష్మీ, నబీల్, మణికంఠ కూడా వెళ్లారు. మొత్తానికి నిఖిల్ చేతి నుంచి విష్ణుప్రియకి సుత్తి అందించారు. దీంతో విష్ణుప్రియ సుత్తిని ప్రేరణ చేతికి ఇచ్చింది. ఇంకేముంది ముందే ప్లాన్ చేసినట్లుగా సోనియాను లేపేసింది ప్రేరణ. నీకు ఆల్ రెడీ చీఫ్ అయ్యేందుకు ఓ ఛాన్స్ వచ్చింది.. కానీ యూజ్ చేసుకోలేకపోయావంటూ ప్రేరణ రీజన్ ఇచ్చింది. ఇలా ఒక్కో బొమ్మ పగిలిపోతు చివరిగా సీత-ప్రేరణ మాత్రమే రేసులో మిగిలారు. అప్పుడూ బిగ్‌బాస్ కలుగజేసుకొని ఈసారి డైరెక్ట్‌గా నైనికకే సుత్తిని ఇచ్చాడు. దీంతో ప్రేరణను రేసు నుంచి తప్పించింది. ఇక కొత్త చీఫ్ గా సీత నిలిచింది.