English | Telugu

సోనియాపై యష్మీ నామినేషన్...నీలా నేను ఆ ఇద్దరిని వాడుకోను!

బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన నామినేషన్లో సోనియాకి గట్టి దెబ్బే తగిలింది. ఓ వైపు నబీల్ వ్యాలిడ్ పాయింట్లు చెప్తూ సోనియాని నామినేట్ చేసాడు. అలాగే ఆదిత్య ఓం కూడా వ్యాలిడ్ రీజన్స్ చెప్పి నామినేషన్ చేశాడు. దాంతో సోనియా ఆ ఇద్దరిని వాడుకుంటుందని హౌస్ మేట్స్ అందరికి అర్థమైంది.

నిన్న జరిగిన నామినేషన్లో ప్రేరణ, ఆదిత్య ఓం ని విష్ణుప్రియ నామినేట్ చేసింది. అలాగే ప్రేరణని గత వారం చేసిన పాయింట్ మీద కిర్రాక్ సీత నామినేట్ చేసింది. అయితే ఇలా ఒక్కొక్కరు నామినేట్ చేసుకోగా యష్మీ-సోనియా నామినేషన్ హైలైట్ ఆఫ్ ది నామినేషన్ డే గా నిలిచింది. ఎందుకంటే యష్మీ మాట్లాడిన ప్రతీది ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. అసలు నామినేషన్ లో ఏం చెప్పిందంటే.. మొదట్లో నేను నిన్ను నా క్లాన్‌లోకి తీసుకుంది ఎందుకంటే నేను తప్పు చేసినా మాట్లాడతావని తీసుకున్నా.. కానీ నువ్వు ఆ రూల్ ఫాలో అవ్వలేదు.. కానీ నిఖిల్ క్లాన్‌లో ఉన్నప్పుడు మాత్రం బాగానే సలహాలు ఇస్తున్నావ్.. ఇక నా రెండో పాయింట్.. అండా(గుడ్డు) టాస్కు గురించి ఇందాక మాట్లాడుతూ నువ్వే చెప్పావ్.. వాళ్ల (నిఖిల్, పృథ్వీ) అగ్రెషన్ నీ స్ట్రెంత్ అని.. ఆ బలాన్ని నువ్వు వాడుకున్నావ్ తప్ప‌‌‌.. నువ్వు ఆడటానికి ముందుకు రాలేదు.. ఇద్దరి సపోర్ట్ లేకుండా నువ్వు సెపరెట్‌గా ఆడి ఉంటే బాగుండేదని నాకు అనిపించిందంటూ యష్మీ తన నామినేషన్ రీజన్ చెప్పింది. దీనికి సోనియా సమాధానమిస్తూ..వాళ్లని ముందు పెట్టి.. నేను ఆడలేదు అంటున్ననావ్ కదా.. అవును నేను అగ్రీ చేస్తున్నాను.. కానీ నేను ఇక్కడున్నా ఏ మగాడి కంటే కూడా అగ్రెషన్‌లో ఎక్కువే.. నా అగ్రెషన్ వల్ల ఎవరిని హర్ట్ చేయకూడదని అనుకున్నా.. నేను గేమ్‌లోకి దిగాక ఎవరిని కొడతానో నాకే తెల్వదు.. ఎందుకురా బాబు కొట్టకుండా ఉండాలని అనుకున్నా కానీ మీ ఫెయిల్డ్ సంచాలక్ నా గేమ్ చూపించుకునే అవకాశం ఇచ్చాడు. అందుకే చివరిలో వచ్చి మీ ఇద్దరినీ (ప్రేరణ, యష్మీ) ఎత్తేసింది కూడా నేనే.. అంటూ సోనియా చెప్పింది.

మరి ఎగ్ టాస్కులో మీ ఎగ్ మీరు తీసుకురావాలి.. వేరే వాళ్ల బుట్టలోవి తేవద్దని ఇద్దరు చీఫ్‌లు అగ్రిమెంట్ చేసుకున్నారు.. అప్పుడు నువ్వెందుకు వెళ్లి మా ఎగ్స్ తీసుకున్నావంటూ యష్మీ అడుగగా..మా చీఫ్ నాకు చెప్పలేదంటూ సోనియా మాట మార్చేసింది. మరి వెళ్దాం పదరా పదరా అని ఏదో ఫంక్షన్‌కి వెళ్లినట్లు పిలిచావ్.. నువ్వు వెళ్లి ఎటాక్ చేయొచ్చు కదా.. వేరే వాళ్లని ఆయుధాల్లాగా యూజ్ చేసుకుంటావ్.. నువ్వు మాత్రం ముందుకు రావు ఆడటానికి అంటూ సోనియాకి ఇచ్చిపడేసింది యష్మీ.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...