English | Telugu

Eto Vellipoyindhi Manasu : బయటకి వెళ్తే ప్రాణ నష్టమే.. భార్య దగ్గర మాట తీసుకున్న భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -217 లో......రామలక్ష్మి ఆఫీస్ లో కన్పించిన రౌడీ ఫోటో ని మాస్క్ తో బొమ్మ గీసి.. సిరికి చూపిస్తుంది. ఇతనే వదిన ఆ రోజు నా నగలు దొంగతనం చెయ్యాలని చూసింది.. వీడే అని చెప్పగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. అదంతా చూస్తున్న శ్రీలత టెన్షన్ పడుతుంది. ఎందుకంటే వాడు ఆఫీస్ కి ఎందుకు వచ్చాడు.. వాడిని పట్టుకుంటే అంతా నిజం భయటపడుతుందని రామలక్ష్మి అనుకుంటుంది. అదంతా విన్న శ్రీలత.. ఇది ఆ ఫోటో పట్టుకొని కనుక్కుంటే తీగ లాగితే డొంక కదిలినట్లు అవుతుందని శ్రీలత ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది.