English | Telugu
Brahmamudi : కనకం రాయబారిగా వచ్చింది.. ఆ ఇద్దరిని కలిపేస్తుందా ఏంటి!
Updated : Sep 25, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -523 లో... కావ్య సైకిల్ పై వస్తుంటే రాజ్ చూడకుండా డాష్ ఇస్తాడు. దాంతో సైకిల్ తో పాటు కావ్య కూడా కింద పడిపోతుంది. ఇక ఇద్దరు కాసేపు వాదించుకుంటారు. ఇక ఈ జన్మలో మా ఇంట్లో అడుగుపెట్టకంటూ రాజ్ కోపంగా మాట్లాడి వెళ్ళిపోతాడు. దాంతో కావ్య బాధపడుతుంది.
ఆ తర్వాత రాజ్ వినాయకుడి విగ్రహం కొనడానికి వస్తాడు. అక్కడ ఏది నచ్చదు కావ్య రెడీ చేసిన విగ్రహం నచ్చడంతో అది కావాలని అడుగుతాడు. ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్పడంతో.. అయిన అదే కావాలి అంటాడు. డబ్బులు ఎక్కువిచ్చి అదే విగ్రహం రాజ్ తీసుకొని వెళ్తాడు. రాజ్ పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఇక కావ్యకి ఫోన్ చెయ్ అంటాడు. ఎందుకని రాజ్ అంటాడు. ఇద్దరు కలిసి పూజ చెయ్యాలని అపర్ణ, ఇందిరాదేవి లు అంటారు. నేను చెయ్యనని రాజ్ కచ్చితంగా.. చెప్పడంతో కావ్య చీర ని పక్కన పెట్టుకొని అయిన పూజ చెయ్ అని ఇందిరాదేవి అంటుంది. స్వప్న వెళ్లి కావ్య చీర తీసుకొని వస్తుంది. రాజ్ పక్కన పెడుతుంది. రాజ్ పూజ చేస్తాడు. అపర్ణ మాత్రం కావ్య వచ్చి పూజ చేసినట్లు కల కంటుంది. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు వినాయకుడి పూజ చేస్తారు. ఆ తర్వాత అప్పుకి పోలీస్ డ్రెస్ ఇస్తాడు కళ్యాణ్. ఇది చూసినప్పుడల్లా నీకు నీ కల గుర్తు వస్తుందని కళ్యాణ్ చెప్తాడు.
మరొకవైపు రాజ్ చేస్తున్న పూజ పూర్తవుతుంది. అప్పుడే కనకం వస్తుంది. తనని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. రుద్రాణి మాత్రం కూతురిని కాపురానికి తీసుకొని రావడానికి రాయబారానికి వచ్చావా అంటుంది. తరువాయి భాగంలో ఈ సాకుతో కూతురిని కాపురానికి పంపించి చేతులు దులుపుకోవాలని అనుకుంటున్నావా అని రుద్రాణి అనగానే.. కూతురు, అల్లుడు విడిపోలేదు. అందుకు సాక్ష్యం అల్లుడు పక్కన నా కూతురు చీర ఉంది. అంతే కాకుండా నా కూతురు తయారు చేసిన విగ్రహం తిరిగి తన ఇంట్లోకి వచ్చిందని కనకం అనగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.