English | Telugu

డేంజర్ జో‌న్‌లో సోనియా, పృథ్వీ.. ఆ అమాయకపు చక్రవర్తిని బలి చేస్తారా?


బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు గేమ్స్ భళే సాగుతున్నాయి. అయితే నామినేషన్ లో ఉన్న ఆరుగురిలో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.

హౌస్ లో బాగా ఆడేది ఎవరంటే మొదటి రెండు వారాల్లో నిఖిల్, విష్ణుప్రియ, కిర్రాక్ సీత ఉండేది.‌ ఇప్పుడు కొత్తగా నబీల్ వచ్చేశాడు. మొదటి రెండు వారాలు సైలెంట్ గా ఉన్న నబీల్.. మూడో వారం నామినేషన్ నుండి ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. దాంతో ఓటింగ్ లో అతనికి అత్యదిక శాతం ఓట్లు పడుతున్నాయి. అంతకుముందు జరిగిన టాస్క్‌లలో కూడా నబీల్ అఫ్రిది అదరగొట్టిన సోనియాని నామినేషన్ చేసిన తర్వాతే అతనికి హైప్ వచ్చింది. ఎందుకంటే అతను గత సీజన్ భోళే షావలి లాగా పర్ఫామెన్స్ చేస్తూ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నాడు.

ఇక ఈ వారం ఎలిమినేషన్ కి దగ్గర్లో ఉన్నది ఆ ఇద్దరు గజదొంగలే.. అదే పృథ్వీ, సోనియా. అయితే ఓటింగ్ ప్రకారం సోనియా లాస్ట్ లో ఉంది.‌ ఎంత అంటే ఆదిత్య ఓం.. పృథ్వీ, సోనియాలపై ఉన్నాడు. ఈ సారి ఈ కన్నింగ్ బ్యాచ్ లో నుండి ఎవరైనైనా పంపిస్తాడా లేక ఆదిత్య ఓం ని బలిచేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి మన బిగ్ బాస్ మామ టీఆర్పీ కోసం పృథ్వీ, సోనియాని లోపలే ఉంచి .. మన అమాయాకపు చక్రవర్తి బలిచేస్తారా అని అనుకుంటున్నారు. మరి ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్ లో ఉన్న పృథ్వీ, సోనియాలలో ఎవరో ఒకరిని బయటకు పంపిస్తాడా లేక మరేదైనా ట్విస్ట్ ఇస్తాడా చూడాలి మరి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...