English | Telugu

Eto Vellipoyindhi Manasu : అత్తకి వార్నింగ్ ఇచ్చిన కోడలు.. కౌంట్ డౌన్ మొదలైందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -209 లో.....సీతాకాంత్ డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తాడు. అప్పుడే శ్రీలత ఇంటికి వస్తుంది. అమ్మ గుడికి వెళ్ళావా అని సీతాకాంత్ అడుగుతాడు. అవును నువ్వు కోలుకుంటే వస్తానని మొక్కుకున్నానని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి శ్రీవల్లి హారతి ఇస్తుంది‌. అందరు ఇంట్లోకి వెళ్తారు. మీరు ఎక్కువసేపు నిల్చొని ఉండకండి. రెస్ట్ తీసుకుండి అని లోపలికి పంపిస్తుంది. ఆ తర్వాత ఈ ఎటాక్ కి కారణం మీరే అని నాకు డౌట్ ఉందని శ్రీలతతో రామలక్ష్మి మాట్లాడుతుంది. మీరు ఎంత నిజం దాచాలని చూసిన నిజం దాగదని రామలక్ష్మి అంటుంది.

దొంగతనం, హత్యా ప్రయత్నం ఎవరు చేశారు.. నిజంగానే మా అయన పైన జరిగిందా.. అని నిజం బయటకు తీస్తా ఎవరైనా లక్ష్యంగా పెట్టుకున్నారా నేను తెలుస్తా.. మీ పాత్ర ఉందని తెలిస్తే నరకం చూపిస్తా.. ఇక కౌంట్ డౌన్.. మీరు దొంగప్రేమ నటించినా దొరికిపోతారు. మీ పాపాల చిట్టా బయటపెట్టి బయటకు పంపిస్తానని శ్రీలతకి వార్నింగ్ ఇస్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత సీతాకాంత్ నొప్పితో బాధపడుతుంటే అప్పుడే రామలక్ష్మి వచ్చి డ్రెస్సింగ్ చేస్తాను పడుకోమని చెప్తుంది. అప్పుడే నందిని రామలక్ష్మికీ ఫోన్ చేస్తుంది సీతాకాంత్ పిలవడంతో రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టి వస్తుంది. సీతాకాంత్ కీ డ్రెస్సింగ్ చేస్తుంటే చెక్కిలిగింతలు అవుతున్నాయని అంటాడు. మీరు కదలకుండా ఉంటే మీకు ముద్దు ఇస్తానని రామలక్ష్మి అనగానే అవునా సరే అంటూ సీతాకాంత్ డ్రెస్సింగ్ చేయించుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని నా ముద్దు ఎక్కడ అని అడుగుతాడు. రామలక్ష్మి తర్వాత ఇస్తానంటూ సరదాగా మాట్లాడుతుంది. అదంతా నందిని ఫోన్ లో వింటూ కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత నందిని మేడమ్ ఎందుకు కాల్ చేశారని నందినికి చేస్తుంది రామలక్ష్మి. సీతాకాంత్ గురించి అడిగి తెలుసుకుందామని చేశా అని తను అంటుంది.

ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలో.. రామలక్ష్మి ఫోటో చింపేస్తుంది‌ నందిని. ఆ తర్వాత తన ఫోటో పక్కనపెట్టి రామలక్ష్మి ఫోటో కాల్చేస్తుంది. అప్పుడే హారిక వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతుంది. నా సీత పక్కన ఎవరిని ఉహించుకోనని నందిని అంటుంది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు.. అయిన నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావంటు హారిక అంటుంది. ఆ తర్వాత ఆఫీస్ గురించి బోర్డు మెంబెర్ సీతాకాంత్ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఆ తర్వాత అతను శ్రీలత, సందీప్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. అది రామలక్ష్మి చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...