English | Telugu

బిగ్ బాస్‌లోకి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ... కంటెస్టెంట్స్ కి బిగ్ షాక్!

తెలుగు బిగ్ బాస్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నేటి ఎపిసోడ్ ఉండబోతుందని తాజాగా విడుదలైన ప్రోమోని చూస్తే తెలుస్తుంది.

హౌస్ లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేషన్ అయి బయటకు వెళ్లారు. ఇక ఈ వీక్ సర్వైవల్ వీక్ అని చెప్తూ బిగ్ బాస్ ప్రోమోని వదిలాడు. అంటే హౌస్ లోకి ఒక్కటి కాదు అయిదు కాదు మొత్తంగా పన్నెండు(12) మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవ్వబోతున్నారని బిగ్ బాస్ చెప్పడంతో హౌస్ మేట్స్ అంతా షాక్ అయ్యారు. ఇక మొదటిసారి హౌస్ లోని వాళ్ళకి ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటంటే హౌస్ లో కొన్ని టాస్క్ లు పెడతాడు బిగ్ బాస్. హౌస్ లోని వాళ్ళు ఆ టాస్క్ లు తమ ఎఫర్ట్ పెట్టి ఆడి గెలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదు. అంటే ఎన్ని టాస్కలు గెలుస్తారో అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండవని అర్థం. ఇక హౌస్ లో ఇక నుండి ట్విస్ట్ ల‌ మీద ట్విస్ట్ లతో గేమ్స్ ఉండబోతున్నాయని ప్రోమోని బట్టి తెలుస్తుంది. ' వైల్డెస్ట్ ట్విస్ట్ ఎవర్' అంటూ వదిలిన ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ షాకిచ్చాడు బిగ్ బాస్. తాజగా శక్తి క్లాన్, కాంతారా క్లాన్ రెండు టీమ్ లుగా విభజించబడ్డారు.

మరి బిగ్ బాస్ ఇప్పుడు పెట్టే టాస్క్ లు అందరికి కలిపి ఉంటాయా లేక ఇండివిడ్యువల్ టాస్క్ లా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతుందని ప్రోమోని చూస్తే తెలుస్తుంది. మరి మీరు చూసేయ్యండి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...