English | Telugu

ఓటింగ్ లో నబీల్ నెంబర్ వన్.. సోనియా ఎలిమినేషన్ ఫిక్స్!

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారా అనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్ ని పరిశీలించగా ఊహించని విధంగా విన్నర్‌ రేస్‌లోకి దూసుకుని వచ్చేశాడు నబీల్. సోమవారం నాటి నామినేషన్స్‌లో.. అంతకు ముందు జరిగిన టాస్క్‌లలో నబీల్ అఫ్రిది పర్ఫామెన్స్ చూసి ఆడియన్స్ అతనికి ఓట్లు వేస్తున్నారు. ఇక అదే విధంగా సోనియాకి అసలు ఓటింగే లేదు.. అయిదు శాతం ఓటింగ్ తో లీస్ట్ లో ఉంది సోనియా.

ఇక ఓటింగ్ లో నబీల్ కి అత్యధిక శాతం పడుతుంది. 37 శాతం ఓట్లు నబీల్ కి పడుతున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే.. విన్నర్ రేస్‌లో ఉన్న విష్ణు ప్రియ, నిఖిల్‌లు నామినేషన్స్‌లో ఉన్నప్పుడు.. వాళ్లకి 20-25 శాతం మాత్రమే ఓటింగ్ వచ్చేవి. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ నామినేషన్స్‌లో లేరు. అందుకే నబీల్ టాప్ లో ఉన్నాడు. మొత్తం నామినేషన్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉంటే.. 50 పర్సంట్ ఓటింగ్ విష్ణు, నిఖిల్‌లు పంచేసుకునేవారు. అయితే ఈవారంలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వీళ్లిద్దరూ నామినేషన్స్‌‌లో లేరు. నబీల్, మణికంఠ, సోనియా, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య ఓం ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా.. నబీల్ ఆఫ్రిదికి ఊహించని రేంజ్‌లో 37 శాతానికి పైగా ఓట్లను ఆడియన్స్ వేశారు. ముందురోజు జరిగిన నామినేషన్స్ ఓటింగ్‌ని ఏ రేంజ్‌లో ప్రభావితం చేస్తాయి అనడానికి ఇదే ఉదాహరణ. నిన్నటి నామినేషన్స్‌లో సోనియాతో చెడుగుడు ఆడుకున్నాడు నబీల్. దాంతో ఆమెపై ఉన్న నెగిటివిటీ.. నబీల్‌కి పాజిటివ్‌గా మారింది. దాంతో.. విష్ణు ప్రియ, నిఖిల్‌ల కంటే.. ఎక్కువగా ఓటింగ్ శాతం నబీల్‌కి వస్తుండటం విశేషం.

నబీల్ తర్వాత ప్రేరణ, ఆ తర్వాత మణికంఠ ఉండగా.. నాల్గవ స్థానంలో ఆదిత్య ఓం ఉన్నాడు.‌ ఇక చివరి రెండు స్థానాలలో పృథ్వీ, సోనియా ఉన్నారు. ఈ ఓటింగ్ ని బట్టి చూస్తే సోనియా మీద బిగ్ బాస్ చూసేవారంతా పగబట్టినట్టు ఉన్నారు. ఎందుకంటే నిఖిల్, పృథ్వీ ల గేమ్ ని పూర్తిగా మార్చేస్తుంది సోనియా. నిఖిల్ మొదట్లో అగ్రెషన్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు సోనియా చెప్పినట్టే వింటున్నాడు. అందుకే సోనియా బయటకు వస్తే నిఖిల్, పృథ్వీల ఆట మెరుగుపడుతుందని భావించిన నిఖిల్ ఫ్యాన్స్.. ఓటింగ్ లో వీరికన్నా పైనున్న ఆదిత్య ఓం కి ఓట్లు వేస్తున్నారు. దీంతో సోనియా లీస్ట్ లో‌ ఉంటు వస్తోంది. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...