English | Telugu

ఒకప్పుడు ఆవులకు, దూడలకు వేసిది.. ఇప్పుడు నువ్వు తింటున్నావ్!

అనసూయ భరద్వాజ్.. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటి తెచ్చుకున్న అనసూయ..‌ 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. తాజాగా 'రంగమార్తాండ' సినిమాలో మంచి పాత్రని చేసానని మీడీయా ముందు ఎమోషనల్ అయింది. తన తర్వాతి సినిమా 'విమానం' మూవీ పోస్టర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి నుండే ప్రమోషన్ ని మొదలుపెట్టింది. అయితే 'విమానం' సినిమా కథ బాగుండటంతో విమర్శకుల ప్రశంసలు పొంది భారీ హిట్ గా నిలిచింది. దాంతో అనసూయ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది.

కృష్ణభగవాన్ మీద ప్రవీణ్ పంచ్..నువ్వు ఆ రాయి ఇచ్చాకే కిడ్నీలో రాళ్లు వచ్చాయంటూ కౌంటర్

ఎక్స్ట్రా జబర్దస్త్ లో పటాస్ ప్రవీణ్ మంచి కామెడీ స్కిట్ వేసాడు. కృష్ణ భగవాన్ మీద కామెడీ చేద్దాం అనుకున్నాడు కానీ అది రివర్స్ లో ప్రవీణ్ కే తెగిలింది. రంగురాళ్లు అమ్ముకునే అబ్బాయి క్యారెక్టర్ చేసాడు. "ఈ బీచ్ పేరేమిటో తెలుసా..మెరీనా బీచ్ కానీ అప్పుడప్పుడు రష్మీ వచ్చేసరికి రష్మీ బీచ్ ఐపోయింది" అని ప్రవీణ్ చెప్పేసరికి రష్మీ షాకైపోయింది. "ఈ బీచ్ లో నాకు రంగు రాళ్ళ బిజినెస్ ఒకటి ఉంది.. ఈ రాళ్లు పెట్టుకున్నవాళ్లంతా ఎక్కడో ఉన్నారు తెల్సా రష్మిగారు" అనేసరికి "అవునా" అంది రష్మీ. "అంతెందుకండి ఈ అమ్మాయి వెనక ఒక అబ్బాయి అలా గాలికి తిరిగేవాడు..అలా గాలికి తిరుగుతున్నాడని ఒక రింగ్ పెట్టా...గాలోడై ఇప్పుడు హిట్ కొట్టి రష్మీ కూడా దొరక్కుండా తిరుగుతున్నాడు" అంటూ ప్రవీణ్ సుడిగాలి సుధీర్ మీద ఒక పంచ్ వేసాడు.

హరిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఫైమా

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లేటెస్ట్ వీక్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. "సింగల్ కింగ్స్ వర్సెస్ సింగల్ క్వీన్స్" కాన్సెప్ట్ తో రాబోతోంది శ్రీముఖి. ఇక ఇందులో ఎక్స్ప్రెస్ హరి వచ్చి ఫైమాని కిస్ అడిగేసరికి ఫైమా స్కూటీ కీస్ ఇచ్చి నవ్వించింది. అడిగింది కిస్సు కీస్ కాదు అన్నాడు హరి.  "నేను హరిని పెళ్లి చేసుకుందాం" . అనుకుంటున్నానని చెప్పింది ఫైమా..ఆ మాటకు షాకైపోయింది శ్రీముఖి. "ఫైమా స్టేటస్ ఏంటో తెలుసా" అని హరిని అడిగింది శ్రీముఖి.  తర్వాత స్టేజి మీద సింగల్ కింగ్స్ కొంతమంది వచ్చారు.  ఇక అవినాష్ తన స్టయిల్లో ఈ సింగల్ కింగ్స్ తో ప్రమాణం చేయించాడు. "ఎంత అందమైన అమ్మాయి కనిపించినా సింగల్ గా ఉంటూ కింగుల్లా ఉంటాం" అని ప్రమాణం చేయించుకున్నాడు. తర్వాత సింగల్ క్వీన్స్ వచ్చేసరికి శ్రీముఖి కూడా వాళ్ళతో ప్రమాణం చేయించింది.

చందమామను చూపించకుండా డ్రామా జూనియర్స్ చూపించి అన్నం పెడుతున్నారు

చిన్నారులు హిలేరియస్ స్కిట్స్ తో ఎంతోమందిని అలరిస్తున్న డ్రామా జూనియర్స్ సీజన్ 6  నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక జయప్రద, శ్రీదేవి, బాబూమోహన్ స్టేజి మీదకు వచ్చేసరికి యాంకర్ ప్రదీప్ ఒక స్వీట్ కామెంట్ చేసాడు. "ఇది వరకు చందమామను చూపించి అన్నం తినిపించేవాళ్లు చిన్నప్పుడు..కానీ ఇప్పుడు చూపించట్లేదు" అని చెప్పాడు. దానికి జయప్రద ఎందుకు అని అడిగింది "ఇప్పుడు డ్రామా జూనియర్స్ చూపిస్తున్నారు ఎందుకంటే రెండు చందమామలు ఇక్కడే ఉన్నాయి కదా" అనేసరికి వాళ్ళు నవ్వేశారు. ఇక ఈ ఎపిసోడ్ కి "హిడింబా" మూవీ నుంచి అశ్విన్, నందిత శ్వేతా వచ్చారు. "హలో నందిత గారు ఎలా ఉన్నారు" అని ప్రదీప్ ఏమీ తెలియనట్టు అడిగేసరికి "ఏమీ తెలియనట్టే మాట్లాడుకుంటారు మీరిద్దరూ" అని అశ్విన్ బాబు కౌంటర్ వేశారు.

పెద్ద స్టార్స్ కి మాత్రమే ఫుల్ క్యారవాన్ ఇస్తారు!

"నీతోనే డాన్స్" షో మొదలైన దగ్గర నుంచి ఫుల్ జోష్ తో దూసుకుపోతోంది. ఇక ఈ షోకి జడ్జిగా ఉన్న తరుణ్ మాష్టర్ వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తరుణ్ మాష్టర్ రీసెంట్ గా "గరం మసాలా విత్ తరుణ్ మాష్టర్" అనే యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు. ఇందులో అన్ని రకాల వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి తరుణ్ మాష్టర్ ఇప్పుడు రాధ, సదా గార్ల క్యారవాన్ వీడియో చేశారు. ఒక క్యారవాన్ లో సగం సదా గారికి, సగం తరుణ్ మాష్టర్ కి ఇచ్చారు. కానీ రాధ గారికి మాత్రం ఒక ఫుల్ క్యారవాన్ ఇచ్చేసారు. అలా ఎందుకు ఇచ్చారో కూడా చెప్పారు తరుణ్ మాష్టర్. ఈ క్యారవాన్ ఓన్లీ ఫర్ స్టార్ సెలబ్రిటీస్ కి మాత్రమే ఇస్తారట. ఎందుకంటే వాళ్లకు కాస్ట్యూమ్స్, షూట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్లకు ఈ క్యారవాన్ మొత్తాన్ని ఇచ్చేస్తారట.

రవితేజకి అసలు ఆటిట్యూడ్ కానీ, ప్రౌడ్ ఫీలింగ్ కానీ లేదు!

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈ వారం ఎపిసోడ్ లో  అన్స్టాపబుల్ అత్తలు- ఖతర్నాక్ కోడళ్ల మధ్య పోటీలు జరిగాయి. ఇక ఇందులో రాశి కూడా వచ్చింది ఈ షోకి. "వెంకీ" మూవీ నుంచి "మాస్ తో పెట్టుకుంటే" అనే సాంగ్ కి డాన్స్ చేసింది. తర్వాత శ్రీముఖి ఈ సాంగ్ తో తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి రాశిని అడిగింది. "మీ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో మంచి సినిమాలు చేశారు ..అంతేకాదు ఎన్నో స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించారు. వెంకీ మూవీలో ఈ పాట ఫుల్ పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ తో మీ  వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ .చేసుకోండి" అని అడిగింది శ్రీముఖి. " మనసిచ్చి చూడు మూవీ నుంచి కూడా నాకు రవితేజ గారు తెలుసు...అందులో నవీన్ కి ఫ్రెండ్ రోల్ చేశారు. తర్వాత మా కంబినేషన్ లో మూవీస్ ఏమీ రాలేదు.

కావ్య గురించి పాజిటివ్ గా చెప్పిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -142 లో.. కళ్యాణ్ కి కావ్య ఫోన్ చేసి రాజ్ గురించి చెప్తూ బాధపడుతుంది. రాజ్ ట్రీట్మెంట్ కి కళ్యాణ్ డబ్బులు పంపిస్తాడు. ఆ తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ అయ్యాక రాజ్ ఆ ప్రాబ్లెమ్ నుండి బయటపడతాడు. మరొకవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న అప్పు కోసం..  సీతరామయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడి తనని బయటకు తీసుకువద్దామని కృష్ణమూర్తి తో కనకం అంటుంది. వద్దు.. ఇప్పటికే స్వప్న చేసిన పనికి మన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్న కూతురు ఇలా చేసిందని ఇంకెలా మాట్లాడతారోనని వద్దని కృష్ణమూర్తి అంటాడు.

ఇంతకు నా భార్య ఎవరు..అని అడిగిన బాబు...నీకు, నీ అన్న ఇస్తానన్న రష్మీ

ఎక్స్ట్రా జబర్దస్త్ లో నిన్న మొన్నటి వరకు చాలా కామ్ గోయింగా ఉండే బాబు ఈ వారం స్కిట్ లో రెచ్చిపోయాడు. ఇంతకు నా భార్య వర్షానా, రష్మీనా అని అడిగేశాడు..ఇంతకు ఎందుకలా అన్నాడో చూద్దాం.. ఈవారం "అత్త లేని అల్లుడు అదృష్టవంతుడు" అనే స్కిట్ లో  తాగుబోతు భర్త రోల్ లో స్కిట్ వేశారు బాబు, వర్షా, ఇమ్మానుయేల్. "నేను తాగుబొతోడిని పెళ్లి చేసుకున్నా..కానీ నువ్వు మాత్రం అలా చేసుకోకు" అని వర్షా రష్మీకి చెప్పింది. ఇంతలో బాబు మందుబాటిల్ తీసుకుని డాన్స్వ చేసుకుంటూ వచ్చాడు. తాగిన కోటాలో కొట్టుకుపోతుందని రష్మీ మీద డైలాగ్ కూడా విసిరేసాడు బాబు.."ఏమే..నేను వచ్చేలోగా అన్నం, కూరా వండమంటే..అందంగా రెడీ అయ్యి ఇక్కడ కూర్చుంటావా" అనేసరికి "ఏవండీ ఆవిడ కాదు నేను మీ ఆవిడ" అని పిలిచింది వర్షా.