English | Telugu

మంచు లక్ష్మిని పొగిడిన వర్షా...జబర్దస్త్ కి బ్రేక్ ఇచ్చి తర్వాత సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్తా

జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎన్నో షోస్, ఈవెంట్స్ తో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక వర్ష తన యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తుంది. అందులో వాళ్ళ వాచ్ మ్యాన్ వాళ్ళ బాబు తో కూడా ఒక వీడియో చేసి పెట్టింది. ఐతే ఆ పిల్లాడిని తానె చదివిస్తున్నానని కూడా చెప్పింది. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి పని మన నుంచి మొదలైతే అది మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది అనేది తన ఆలోచన అని చెప్పింది. అలాగే వాచ్ మ్యాన్ వాళ్ళ బాబుతో చేసిన వీడియో మీద మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అంది. ఉన్నదాంట్లో ఎంతో కొంత ఆ పిల్లాడి కోసం తీసి పక్కన పెడతానని చెప్పింది వర్షా. ఎడ్యుకేషన్ అనేది ఒకరి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ విషయంలో హెల్ప్ చేయడం మంచిది అంది.

త్వరలో బీబీ షైనింగ్ స్టార్స్..నవదీప్ ని కం టు మై రూమ్ అన్న బ్రహ్మాజీ

బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో వామప్ రిహార్సల్స్ చేస్తోంది. ఆడియన్స్ ని బిగ్ బాస్ మూడ్ లోకి తీసుకురావడానికి చాల ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ మాలో బీబీ షైనింగ్ స్టార్స్ పేరుతో ఒక షోని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన ఒక ప్రోమోని కూడా రీసెంట్ గా రిలీజ్ చేసింది. ఇందులో బిగ్ బాస్ 6 సీజన్స్ లో పార్టిసిపేట్ చేసిన స్టార్స్ అంతా ఒక వేదిక మీద కనిపించబోతున్నారు. ఇక సుమ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. ఇంత మంది స్టార్స్ ఒకే వేదిక మీద కనిపిస్తే ఎలా ఉంటుంది అంటూ హుషారెత్తించే మాటలు మాట్లాడింది.

ట్రెండింగ్ లో షణ్ముఖ్ జస్వంత్ టేల్స్ ఆఫ్ స్టుడెంట్ ఫస్ట్ గ్లింప్స్!

షణ్ముఖ్ జస్వంత్.. యూట్యూబర్. " వైవా" షార్ట్‌ ఫిల్మ్ ద్వారా మొదటి సారే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత "వైవా న్యూస్" తో మరోసారి ఫన్ ని క్రియేట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉన్నాడు‌. ఆ తర్వాత అతను యూట్యూబ్ లో ఒక "ది సాఫ్ట్‌వేర్ డెవలపర్‌"  వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్‌ సిరీస్ లో  "బేబీ" సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య చేసింది. ఈ సిరీస్ లో షణ్ముఖ్ ని వైష్ణవి "మిస్టర్ షన్ను" అని పిలవడంతో ఈ పాత్ర బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత  "సూర్య" అనే వెబ్ సిరీస్ లో "సూర్య" పాత్రకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు షణ్ముఖ్. ఏప్రిల్ 2023 నాటికి 4.3 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్ లని కలిగి ఉన్నాడు.

కావ్యని పుట్టింటికి తీసుకెళ్ళిన రాజ్.. ధాన్యలక్ష్మిని అవమానించిన స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -155 లో.. కావ్య చాటుగా కూర్చొని  డిజైన్స్ వేస్తూ ఉంటుంది. రాజ్ వచ్చి కావ్య డిజైన్స్ వేస్తుందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఎందుకు నాకు తెలియకుండా డిజైన్స్ వేస్తున్నావ్.. నాకు తెలియకూడదు అనుకున్నావా? తెలిసినా ఎంకరేజ్ చెయ్యడని చెప్పట్లేదా అని రాజ్ అడుగుతాడు. "అవును మీకు తెలియకూడదని ఇలా చేస్తున్నాను. మీరు డిజైన్స్ విషయంలో టెన్షన్ పడుతున్నారని నేను ఆఫీస్ కి వచ్చాను. నేను డిజైన్స్ వేసి తీసుకొని వస్తే మీరు చింపేసి డస్ట్ బిన్ లో పడేసారు. అవే డిజైన్స్ శృతి తీసుకొని వస్తే బాగున్నాయని మెచ్చుకున్నారు. అందుకే మీకు తెలియకూడదని శిరీష లాగా మారాను" అని కావ్య చెప్తుంది.

లవ్ లేదు.. బొంగు లేదు.. కొవ్వు తగ్గిస్తా అంటున్న అఖిల్ సార్థక్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ ముందు వరకు ఎవరికి తెలియదనే చెప్పాలి. బిగ్ బాస్ 4 ఎంట్రీతోనే ప్రేక్షకులకు దగ్గరై ఫేమ్  సంపాదించుకున్నడు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు.. 'నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో' అని అన్నట్లుగా ఉండేవాడు అఖిల్. అతని బిహేవియర్ చాలా మందికి నచ్చేది కాదు. అంతేకాకుండా హౌస్ లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్, అభిజిత్ ల పంచాయతీ వీధుల్లో కుళాయిల దగ్గర ఉండే కొట్లాటలాగా ఉండేది. అఖిల్ బిగ్ బాస్-4 రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా మరోసారి ఎంట్రీ ఇచ్చి.. అందులో కూడా రన్నరప్ గానే నిలిచాడు.