English | Telugu

కావ్య గురించి పాజిటివ్ గా చెప్పిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -142 లో.. కళ్యాణ్ కి కావ్య ఫోన్ చేసి రాజ్ గురించి చెప్తూ బాధపడుతుంది. రాజ్ ట్రీట్మెంట్ కి కళ్యాణ్ డబ్బులు పంపిస్తాడు. ఆ తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ అయ్యాక రాజ్ ఆ ప్రాబ్లెమ్ నుండి బయటపడతాడు. మరొకవైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న అప్పు కోసం.. సీతరామయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడి తనని బయటకు తీసుకువద్దామని కృష్ణమూర్తి తో కనకం అంటుంది. వద్దు.. ఇప్పటికే స్వప్న చేసిన పనికి మన కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చిన్న కూతురు ఇలా చేసిందని ఇంకెలా మాట్లాడతారోనని వద్దని కృష్ణమూర్తి అంటాడు.

ఆ తర్వాత రాజ్ , కావ్య ఇద్దరు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తారు. రాజ్, కావ్య ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత.. కావ్య వంట చేసి రాజ్ కి భోజనం తినమని ఇస్తుంది. ఇప్పుడు కూడా నాపై పంతం ఎందుకని కావ్య తినమని చెప్తుంది. సరేనని రాజ్ తింటాడు. ఆ తర్వాత రాజ్ నిద్రపోతాడు. కావ్య మాత్రం రాత్రంతా నిద్ర పోకుండా రాజ్ ని చూస్తూనే ఉంటుంది. మరొక వైపు రాత్రంతా స్టేషన్ ముందే ఉండి బాధపడుతున్న కనకం, కృష్ణమూర్తిల దగ్గరికి కానిస్టేబుల్ వచ్చి.. మీకు ఎవరైనా పెద్దవాళ్ళు తెలిస్తే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపించండి.

లేదంటే విషయం కోర్ట్ కి వెళ్తే.. కోర్ట్ చుట్టూ తిరగాల్సి ఉంటుందని చెప్తుంది. అలా కానిస్టేబుల్ చెప్పగానే కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కలిసి సీతరామయ్య దగ్గరికి బయలుదేరతారు. మరొక వైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా శ్రీశైలం నుండి ఇంటికి వస్తారు. అలా రావడంతోనే కావ్యని అపర్ణ తిట్టడం స్టార్ట్ చేస్తుంది. రాజ్ కి రాత్రి అంత బాధ కలిగితే చెప్పాలని తెలియదా అని కావ్యని అపర్ణ అంటుంది . నేను ఉన్న టెన్షన్ లో నాకు ఆ ఆలోచన రాలేదు. ముందు తనని కాపాడుకోవాలనే ఆలోచన తప్ప నాకు ఏది గుర్తు లేదని కావ్య అంటుంది. మీ ఫ్యామిలీనే ఇంత అంటూ కావ్య కుటుంబాన్ని అపర్ణ తిడుతుంది. అప్పుడే గుమ్మం దాకా వచ్చి అపర్ణ మాటలు విని కనకం కృష్ణమూర్తి ఇద్దరు వెన్నక్కి వెళ్ళిపోతారు. అపర్ణ అలా కావ్య పై కోప్పడుతుండగా.. రాజ్ నిద్ర నుండి లేచి కిందకి వస్తాడు.

ఆ తర్వాత రాజ్ దగ్గరికి అందరూ వెళ్ళి.. ఇప్పుడు ఎలా ఉన్నావని అందరూ అడుగుతారు. అంత ఈ కావ్య వళ్లే అని అపర్ణ అంటుంది. అలా అని ఎవరు చెప్పారు.. నిజం ఏంటో తెలుసుకోకుండా ఆలా నిందించడం తప్పని, నేనే వినకుండా ఐస్ క్రీం తిన్నాను అందుకే ఇలా అయింది. తనే సెక్యూరిటీ స్కూటీపై నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళిందని రాజ్ చెప్తాడు. అలా రాజ్ తన గురించి చెప్పేసరికి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.