Read more!

English | Telugu

భవాని రాగానే యాక్టింగ్ స్టార్ట్ చేసిన ముకుంద! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -204 లో.. భవాని ఆశ్రమం నుండి వస్తుందని ఈశ్వర్ అతని కొడుకు మధు ఎదురుచూస్తుండగా, భవాని వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి గ్రాంఢ్ గా వెల్ కమ్ చెప్తారు. చాలా రోజుల తర్వాత ఇల్లు చూసి మురిసిపోతుంది భవాని‌.

భవాని ఇంట్లోకి వచ్చాక మొదటగా.‌‌. ముకుంద ఎక్కడ అని రేవతిని అడుగుతుంది‌. అలా భవాని అడగడంతోనే రేవతి షాక్ అవుతుంది. అదేంటి అక్కా.. మురారి గురించి అడుగుతావని అనుకుంటే ముకుంద గురించి అడిగావేంటని రేవతి అంటుంది. కారణం లేకుండా ఏదీ అడుగనని నీకు తెలుసు కదా అని భవాని అంటుంది. అప్పుడు అక్కడే ఉన్న మధు.. తను గదిలో ఉందని చెప్తాడు. ముకుంద.. మీ అత్తయ్య వచ్చారని రేవతి పిలుస్తుంది. ఇక ఇదే చాన్స్ అని ముకుంద తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఒంటరిగా ఉంటున్నట్టు, వాళ్ళ అమ్మకి బాగోలేకపోవడం వల్ల తను బాధపడుతున్నట్టుగా భవానిని పట్టుకొని ఏడుస్తుంది. ఇక ఇదంతా భవాని నమ్మి తనని అక్కున చేర్చుకుంటుంది.

ఆ తర్వాత కాసేపటికి కృష్ణ, మురారి వస్తారు‌. భవానిని చూసి హ్యాపీగా ఆశీర్వాదం తీసుకుందామని తన దగ్గరగా వెళ్తుంటే.. వద్దని భవాని అంటుంది. ఏం అయిందని మురారి అడుగగా.. మీరిద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరగడమేనా .. ఇంట్లో ఒంటరిగా ఉన్న ముకుందని పట్టించుకోరా అని మురారిని అడుగుతుంది భవాని. దాంతో మురారి మౌనంగా ఉంటాడు. "ఇక నుండి ముకుంద అంటే మన ఫ్యామిలీ.‌. ఉమ్మడి కుటుంబం అంటే ఎవరి గదుల్లో వారుండటం కాదు అందరు కలిసి ఉండటం" అని భవాని చెప్తుంది. ముకుందకి ధైర్యం చెప్పి పంపిస్తుంది భవాని. ఆ తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్తారు. కృష్ణ, మురారి వారి గదిలో ఉండి ఒకరితో ఒకరు ఏదో చెప్పాలని ఒకేసారి మాట్లాడుతారు. నీకొకటి చెప్పాలి కృష్ణ కానీ చెప్పడానికి ధైర్యం చాలట్లేదని అనగానే.. సరే కళ్ళు మూసుకుంటాను అప్పుడు చెప్పండని కృష్ణ కళ్ళు మూసుకుంటుంది. అయినా మురారికి చెప్పడానికి నోటి నుండి మాట రాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.