Read more!

English | Telugu

తనని కృష్ణ ప్రేమిస్తుందని తెలుసుకున్న ముకుంద ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -203 లో.. పడుకున్న మురారిని కృష్ణ నిద్ర నుండి లేపుతుంది. మీరు ఎంత అడిగినా నిజం చెప్పట్లేదని కృష్ణ అంటుంది. అదేం లేదు కృష్ణ.. నీకు అబద్దం చెప్పట్లేదని మురారి అనగానే.. అన్ని అబద్ధాలని కృష్ణ అంటుంది. సారి కృష్ణ ఇన్ని అబద్ధాలు నేను ఆడలేను. నీకు ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్తానని మురారి తన మనసులో అనుకుంటాడు.

ఆ తర్వాత మురారి ప్రేమించిన అమ్మాయి ఎవరో గీతికకి తెలిసే ఉంటుందని, గీతికకి ఫోన్ చేసి కలుద్దామని కృష్ణ అంటుంది. దానికి గీతిక సరే అంటుంది. ఆ తర్వాత కృష్ణ, గీతికని కలుస్తుంది. వాళ్ళు మాట్లాడుకునేది చాటుగా ఉండి ముకుంద వింటుంది. ఎందుకు కలవాలని అన్నావని గీతిక అడుగగా.. నీకు ఏసీపీ సర్ ఫ్రెండ్ కదా.. నీకు ఏసీపీ సర్ ప్రేమించిన అమ్మాయి తెలుసా అని గీతికని కృష్ణ అడుగుతుంది.‌ తెలియదు. అయినా ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఏం చేస్తావని గీతిక అడుగుతుంది. ఏం చేయను.. బ్రేకప్ అయ్యాక నన్ను పెళ్లి చేసుకున్నాడా లేక మా పెళ్లితో బ్రేకప్ అయిందా తెలుసుకుందామని అడుగుతున్నాని కృష్ణ అంటుంది.

ఆ తర్వాత మురారి ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని కృష్ణ గీతికకు చెప్పగానే.. ముకుంద షాక్ అవుతుంది. ఏంటి కృష్ణ కూడా మురారిని ప్రేమిస్తుందా అని అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.‌మరొక వైపు శ్రీనివాస్ దగ్గరికి భవాని వస్తుంది. మీరు ముకుంద గురించి టెన్షన్ పడకండి. తను మా ఇంటి మనిషి ఆదర్శ్ రాకుంటే నేను వేరే పెళ్లి చేస్తానంటూ శ్రీనివాస్ కి ధైర్యం చెప్తుంది భవాని. అలా చెప్పి తను వెళ్ళిపోయాక ముకుంద గురించి అసలు నిజం భవానికి చెప్పాలని శ్రీనివాస్ అనుకుంటాడు.

మరొక వైపు కృష్ణ మాటలను ‌విన్న ముకుంద.. ఎమోషనల్ అవుతుంది. అటు కృష్ణ ప్రేమిస్తుంది. ఇటు మురారి ప్రేమిస్తున్నాడు. ఇన్ని రోజులు అగ్రిమెంట్ పూర్తయి కృష్ణ వెళ్ళిపోతుందని ఆశ ఉండేది. ఇప్పుడు ఇక ఆలస్యం చేయవద్దు. నేను నా ప్రేమని త్యాగం చెయ్యలేను. నా ప్రేమ ని దక్కించుకుంటానని ముకుంద అనుకుంటుంది. మరొక వైపు కృష్ణ, మురారి ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. కృష్ణ తన ప్రేమ ని మురారికి, మురారి తన ప్రేమని కృష్ణకి చెప్పాలని ఫిక్స్ అవుతారు. మరొక వైపు భవాని ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.