Read more!

English | Telugu

మిషన్ ఎడ్యుకేషన్ అథారిటీ మొత్తం జగతికి అప్పగించిన ఫణీంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -809 లో.. మహేంద్ర, ఫణీంద్ర హాల్లో కూర్చొని మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే ఏదో డాక్యమెంట్స్ తీసుకొని జగతి వస్తుంది. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసావా అని ఫణింద్ర అడుగుతాడు. అన్ని రెడీ మీరు సైన్ పెడితే అయిపోద్దని జగతి అంటుంది.

ఆ తర్వాత జగతి తెచ్చిన డాక్యమెంట్స్ పై ఫణింద్ర, మహేంద్రలు సంతకాలు పెడతారు. అప్పుడే దేవయాని, శైలేంద్ర వస్తారు. మీరు కూడా సంతకం పెట్టండని ఫణీంద్ర అనగానే.. ఏంటవని శైలేంద్ర అడుగుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ సంబంధించి అథారిటి మొత్తం జగతికే అని డాక్యుమెంట్స్ రెడీ చేసి మినిస్టర్ తీసుకొని రమ్మన్నాడట.. అందుకే మీరు కూడా బోర్డు సభ్యులు కాబట్టి మిమ్మల్ని సంతకం చెయ్యమంటున్నా అని ఫణింద్ర అంటాడు. దేవయాని, శైలేంద్ర కి సంతకాలు చెయ్యడం ఇష్టం లేకున్నా ఫణింద్ర కోసం ఇద్దరు సంతకాలు చేస్తారు. అందరూ వెళ్ళిపోయాక... ఏంటి జగతి ఇదంతా నీ ప్లాన్ కదా అని దేవయాని అడుగుతుంది.

అవును నా ప్లాన్ అని జగతి అంటుంది. వాళ్ళ మాటలు దూరం నుండి మహేంద్ర వింటాడు. మరొక వైపు వసుధారకి ప్రిన్సిపల్ ఫోన్ చేసి కాలేజీ లో జరిగే సెమినార్ గురించి చెప్తాడు. నేను సెమినార్ లో వచ్చి పార్టిసిపేట్ చేస్తానని ప్రిన్సిపల్ కి వసుధార చెప్తుంది. మరొక వైపు దేవయానితో జగతి ధైర్యంగా మాట్లాడం..మహేంద్ర గుర్తు చేసుకుంటాడు. అప్పుడే జగతి వస్తుంది. ఏంటి వాళ్ళతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నావని మహేంద్ర అడుగుతాడు. వాళ్ళతో అలా మాట్లాడాలి, మన బలహీనతని చూపించవద్దని జగతి అంటుంది. ఒకసారి భయపడి అందరిని దూరం చేసుకున్నాను. మళ్ళీ ఆ తప్పు చెయ్యనని జగతి అంటుంది. ఎలాగైనా రిషి, వసుధారలని తీసుకొని రావాలి. ఈ DBST కాలేజీకి నా కొడుకే రాజు.. రారాజు అని జగతి అంటుంది. 

మరొక వైపు కాలేజీలో స్టాఫ్ మాట్లాడుకుంటుండగా రిషి వస్తాడు. సెమినార్ గురించి చెప్తుండగా వసుధార మేడం వచ్చాక డిస్కషన్ చేసుకుందామని ఒక మేడం అంటుంది. వసుధార మేడం వస్తున్నారా అని రిషి అడుగుతాడు. ఆవును ప్రిన్సిపల్ సర్ చెప్పారని మేడం అనగానే.. అలా ఎలా వస్తుంది. తనకి పూర్తిగా నయం కాలేదు కదా.. వసుధార కచ్చితంగా డిస్కషన్ లో ఉండాలంటే.. నేను ముందు సెమినార్ గురించి తనతో డిస్కషన్ చేస్తానని రిషి అంటాడు. మరొక వైపు అందరూ భోజనం చేస్తుండగా..  జగతి, మహేంద్ర లు పని మీద మూడు రోజులు బయటకు వెళ్తున్నామని చెప్తారు. వాళ్ళెందుకు వెళ్తున్నారని శైలేంద్ర ఆలోచిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.