English | Telugu
రవితేజకి అసలు ఆటిట్యూడ్ కానీ, ప్రౌడ్ ఫీలింగ్ కానీ లేదు!
Updated : Jul 8, 2023
"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈ వారం ఎపిసోడ్ లో అన్స్టాపబుల్ అత్తలు- ఖతర్నాక్ కోడళ్ల మధ్య పోటీలు జరిగాయి. ఇక ఇందులో రాశి కూడా వచ్చింది ఈ షోకి. "వెంకీ" మూవీ నుంచి "మాస్ తో పెట్టుకుంటే" అనే సాంగ్ కి డాన్స్ చేసింది. తర్వాత శ్రీముఖి ఈ సాంగ్ తో తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ గురించి రాశిని అడిగింది. "మీ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో మంచి సినిమాలు చేశారు ..అంతేకాదు ఎన్నో స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించారు. వెంకీ మూవీలో ఈ పాట ఫుల్ పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ .చేసుకోండి" అని అడిగింది శ్రీముఖి. " మనసిచ్చి చూడు మూవీ నుంచి కూడా నాకు రవితేజ గారు తెలుసు...అందులో నవీన్ కి ఫ్రెండ్ రోల్ చేశారు. తర్వాత మా కంబినేషన్ లో మూవీస్ ఏమీ రాలేదు.
ఇక నా కెరీర్ ఎండింగ్ టైంలో ఈ మూవీ వచ్చింది. ఈ సాంగ్ ఆఫర్ వచ్చినప్పుడు నాకు చెయ్యకూడదు అనుకున్నా. ఎందుకంటే నా ఫేస్ హోంలీగా ఉంటుంది కాబట్టి మాస్ సాంగ్ అంతగా సెట్ కాదేమో అని చెప్పాను. అన్ని మూవీస్ లో నా క్యారెక్టర్లు హోమ్లీగా ఉంటాయి కదా ..మరి ఇప్పుడు ఈ సాంగ్ చేస్తే ఎలా అనుకుని నేను మా బ్రదర్ కి కూడా చెప్పాను. డైరెక్టర్ గారు, చాలా మంది కూడా నన్ను ఈ సాంగ్ చేయమని చెప్పారు. అప్పుడు ఒప్పుకున్నా. ఇక ఈ సాంగ్ ని వైజాగ్ లో షూటింగ్ చేశారు. మీరు నమ్మరు కానీ రవితేజకి ఎంత క్రేజ్ ఉండేదో అప్పుడు ..ఎందుకంటే అప్పటికే ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి లాంటి హిట్ మూవీస్ చేసి ఉన్నారు కదా. అక్కడ షూటింగ్ టైంలో జనాలంతా చంటి, చంటి అంటూ ఇడియట్ లో అయన రోల్ నేమ్ తో పిలిచేవారు. నేను ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షాకయ్యా. కానీ ఆయన మాత్రం స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎం మారలేదు. మనసిచ్చి చూడు మూవీ టైములో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఆటిట్యూడ్ లేదు, ప్రౌడ్ ఫీలింగ్ లేదు..ఈ మూవీ యూనిట్ కి థాంక్స్ చెప్పాలి. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్తే ఈ సాంగ్ కి డాన్స్ చేయమని అడుగుతారు." అని తన మెమోరీస్ ని షేర్ చేసుకున్నారు రాశి.