Read more!

English | Telugu

హరిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఫైమా

 

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లేటెస్ట్ వీక్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. "సింగల్ కింగ్స్ వర్సెస్ సింగల్ క్వీన్స్" కాన్సెప్ట్ తో రాబోతోంది శ్రీముఖి. ఇక ఇందులో ఎక్స్ప్రెస్ హరి వచ్చి ఫైమాని కిస్ అడిగేసరికి ఫైమా స్కూటీ కీస్ ఇచ్చి నవ్వించింది. అడిగింది కిస్సు కీస్ కాదు అన్నాడు హరి.  "నేను హరిని పెళ్లి చేసుకుందాం" . అనుకుంటున్నానని చెప్పింది ఫైమా..ఆ మాటకు షాకైపోయింది శ్రీముఖి. "ఫైమా స్టేటస్ ఏంటో తెలుసా" అని హరిని అడిగింది శ్రీముఖి.  తర్వాత స్టేజి మీద సింగల్ కింగ్స్ కొంతమంది వచ్చారు.  ఇక అవినాష్ తన స్టయిల్లో ఈ సింగల్ కింగ్స్ తో ప్రమాణం చేయించాడు. "ఎంత అందమైన అమ్మాయి కనిపించినా సింగల్ గా ఉంటూ కింగుల్లా ఉంటాం" అని ప్రమాణం చేయించుకున్నాడు. తర్వాత సింగల్ క్వీన్స్ వచ్చేసరికి శ్రీముఖి కూడా వాళ్ళతో ప్రమాణం చేయించింది.

"ఎదురుగా ఉన్న అబ్బాయిలు ఎంత టెంప్ట్ చేసినా ఎప్పటికీ సింగల్ క్వీన్స్ గానే ఉంటాం అని ప్రమాణం చేస్తున్నాం" అని చెప్పారు. ఇక క్వీన్స్ తో కూరగాయలు కట్ చేసే టాస్క్ చేయించింది హోస్ట్. కింగ్స్ తో పులప్స్ చేయించాడు అవినాష్. ఇక ఈ షోకి ఇంటర్నేషనల్ మెజీషియన్ బిఎస్ రెడ్డి వచ్చారు. వస్తూనే మ్యాజిక్ చేసి శ్రీముఖికి  పూల బొకే ఇచ్చారు. ఇక లాస్ట్ లో ఒక  అమ్మాయిని నిలబెట్టి ఆమె హాఫ్ పార్టీ ని అటు ఇటు తిప్పేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇలా నెక్స్ట్ వీక్ షో మంచి ఎంటర్టైనింగ్ గా కామెడీగా ఉండబోతోంది. ఈయన మ్యాజిక్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. ఆయన మ్యాజిక్ షోతో ఈ ఎపిసోడ్ ఆడియన్స్ లో ఎనర్జీ నింపబోతోంది.