English | Telugu

ఇంతకు నా భార్య ఎవరు..అని అడిగిన బాబు...నీకు, నీ అన్న ఇస్తానన్న రష్మీ

ఎక్స్ట్రా జబర్దస్త్ లో నిన్న మొన్నటి వరకు చాలా కామ్ గోయింగా ఉండే బాబు ఈ వారం స్కిట్ లో రెచ్చిపోయాడు. ఇంతకు నా భార్య వర్షానా, రష్మీనా అని అడిగేశాడు..ఇంతకు ఎందుకలా అన్నాడో చూద్దాం.. ఈవారం "అత్త లేని అల్లుడు అదృష్టవంతుడు" అనే స్కిట్ లో తాగుబోతు భర్త రోల్ లో స్కిట్ వేశారు బాబు, వర్షా, ఇమ్మానుయేల్. "నేను తాగుబొతోడిని పెళ్లి చేసుకున్నా..కానీ నువ్వు మాత్రం అలా చేసుకోకు" అని వర్షా రష్మీకి చెప్పింది. ఇంతలో బాబు మందుబాటిల్ తీసుకుని డాన్స్వ చేసుకుంటూ వచ్చాడు. తాగిన కోటాలో కొట్టుకుపోతుందని రష్మీ మీద డైలాగ్ కూడా విసిరేసాడు బాబు.."ఏమే..నేను వచ్చేలోగా అన్నం, కూరా వండమంటే..అందంగా రెడీ అయ్యి ఇక్కడ కూర్చుంటావా" అనేసరికి "ఏవండీ ఆవిడ కాదు నేను మీ ఆవిడ" అని పిలిచింది వర్షా.

"రేయ్ ఒక్క ఖాళీ బాటిల్ బీర్ కే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా" అని రష్మీ గట్టిగా అరిచింది. ఇక తాగుబోతులా డైలాగ్స్ చెప్తూ వర్షాని వీపు మీద దబీ దబీ బాదేసరికి వర్షా గట్టిగా అరిచేసింది..."రేయ్ బాబు..తర్వాత నీకు ఉంటది" అంది రష్మీ.. "ఏంటి మేడం..ఇంతకు నా భార్య వర్షానా, రష్మీనా..ఎవరో చెప్పండి..నేను కన్ఫ్యూజ్ అవుతున్నా " అని ఖుష్బూని అడిగాడు. తర్వాత "అసలు నీకు మల్లెపూలు ఎవరు ఇస్తున్నారు" అంటూ బాబు వర్షాని కొట్టడానికి పరిగెట్టేసరికి వర్షా రష్మీ దగ్గరకు వెళ్ళిపోయింది. వెంటనే రష్మీ కర్ర తీసుకుని వచ్చి "పడతాయి నీకు వర్షాని ఒరిజినల్ గా కొడతావా..అని కామెడీగా సీరియస్ అయ్యింది. మా అన్న లేడు అనేగా..వస్తాడు ఆగు నీ పని చెప్తాను" అని ఇన్డైరెక్ట్ గా సుధీర్ టాపిక్ ని తీసుకొచ్చేసరికి ఆగేహే నీకు నీ అన్నకు ఇద్దరినీ ఒంగోపెట్టి ఇస్తా " అని వార్నింగ్ ఇచ్చేసింది రష్మీ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.