Read more!

English | Telugu

రిషిని చూడటానికి బయల్దేరిన జగతి, మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -810 లో.. రిషి ఇంటికి వస్తుండగా.. వసుధార గురించి ఆలోచిస్తుంటాడు‌. నేను పాత జ్ఞాపకాలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను. నేను చెయ్యాలనుకున్నది చేస్తాను. మిషన్ ఎడ్యుకేషన్ లాగే ఈ కాన్సెప్ట్ ని కూడా తీర్చిదిద్దుతానని రిషి అనుకుంటాడు.

మరొక వైపు జగతి, మహేంద్ర ఇద్దరు.. రిషి వసుధారలు ఉన్న దగ్గరికి వెళ్లడానికి అంతా రెడీ చేసుకుంటారు. నేను రిషిని దోషిని చేసానని జగతి బాధపడుతుంది. నువ్వు రిషి కోసం చేసావని మహేంద్ర అంటాడు. మనం వెళ్తున్నట్లు ఎవరితో చెప్పకూడదు.. చెప్తే మనల్ని ఫాలో చేస్తారని జగతి అంటుంది. అప్పుడే శైలేంద్ర వెళ్తూ జగతి మాటలు వింటాడు. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత దేవయాని దగ్గరికి శైలేంద్ర వచ్చి.. "పిన్ని బాబాయ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు.. నాకు అర్థం అయింది.. అదేంటో తెలుసుకోవాలి" అని దేవయానితో అంటాడు శైలేంద్ర. మరొక వైపు రిషి ఇంటికి వస్తాడు. ఇంటి ముందు ప్రిన్సిపల్ సర్ పంపిన కార్ డ్రైవర్.. వసుధార కోసం చూస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఏంటని డ్రైవర్ ని రిషి అడుగుతాడు. వసుధార మేడమ్ ని తీసుకొని ప్రిన్సిపల్ సర్  రమ్మన్నాడని డ్రైవర్ చెప్తాడు. వసుధార మేడమ్ రాదు. మీరు వెళ్ళండి ప్రిన్సిపల్ సార్ కి చెప్పానని రిషి చెప్తాడు. వసుధార రెడీ అయి వస్తుంటే రిషి వెళ్లకుండా అడ్డుపడతాడు. మీరు కాలేజీ కి, ఈ పరిస్థితిలో వెళ్లడం అవసరమా అని రిషి అంటాడు. సర్ నేను ఇప్పుడు కాలేజీకి అవసరమని వసుధార అంటుంది. ఇంటిదగ్గర ఉండి వర్క్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటి ఉందని రిషి చెప్పగానే వసుధార లోపలికి వెళ్తుంది.

జగతి, మహేంద్రలు సంతోషంగా ఉంటారు. చాలా రోజుల తర్వాత రిషిని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని మహేంద్రతో జగతి అంటుంది. నాక్కూడా అలాగే ఉందని మహేంద్ర అంటాడు. మరొక వైపు జగతి మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలని శైలేంద్ర వాళ్ళని ఫాలో చేస్తాడు. వాళ్ళని ఫాలో చేస్తున్న విషయం దేవయానికి ఫోన్ చేసి శైలేంద్ర చెప్తాడు. వాళ్ళని కూడా రిషి లాగే చంపేస్తానని దేవయానితో శైలేంద్ర అంటాడు. లేదు అలా చెయ్యకు ఓపిక పట్టని దేవయాని చెప్తుంది. మరొకవైపు సెమినార్ కి సంబంధించి.. స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్,  రిషి, వసుధార అందరూ వీడియో కాల్ ద్వారా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.