Read more!

Southern Style Chicken Toast Recipe

 

 

 

చికెన్ టోస్ట్

 

 

 

 

 

అసలు చికెన్ అనేది ఒక ఆహార అద్భుతం. రుచిగా వుండటం మాత్రమే కాదు.. ఏ రకంగా వుండుకోవడానికైనా అనుకూలంగా వుంటుంది. ఇప్పుడు చికెన్‌తో ఒక వెరైటీ డిష్ ‘చికెన్ టోస్ట్’ని  మీకు పరిచయం చేయబోతున్నాం. 

 

కావలసిన పదార్థాలు:
చికెన్ - పావుకేజీ 
పెరుగు - మూడు స్పూన్లు
అల్లం - చిన్న ముక్క 
వెల్లుల్లిపాయలు - నాలుగు 
ఎండుమిర్చి - నాలుగు 
గరంమసాలా - కొద్దిగా 
పుదీనా - కొద్దిగా
బ్రెడ్ స్లైస్‌లు - ఆరు 
ఉప్పు, నూనె - తగినంత

 

తయారుచేసే విధానం:

ముందుగా బోన్‌లెస్ చికెన్ తీసుకుని, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆ చికెన్ ముక్కల్ని  మూడుసార్లు నీటితో శుభ్రంగా కడగాలి. ఈ చికెన్ ముక్కల్ని మిక్సీలో వేసి, దానితోపాటు పెరుగు, అల్లం, వెల్లుల్లిపాయలు , ఎండు మిరపకాయలు, గరంమసాలా, పుదీనా, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక్కో బ్రెడ్ స్లైస్ మీద తడిచేతితో ఒకవైపు మాత్రమే మందంగా రాసుకోవాలి. తరువాత ఈ స్లైస్‌లను చాకుతో నిలువుగా మూడు ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఒక బాణిలో నూనెపోసి బాగా కాగాక ఈ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి. ఈ చికెన్ టోస్ట్‌ని టమాట సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.   చికెన్ టోస్ట్