Samosa Pinwheels

 

 


 సమోస పిన్ వీల్స్

 

 

ఇది సాయంత్రం టీ టైం స్నాక్. ఇంటికి సాయంత్రం గెస్ట్ లు వచ్చినపుడు పెట్టడానికి బావుంటాయి.

కావాల్సిన పదార్థాలు:

మైదా                                     : 1 కప్పు

బొంబాయి రవ్వ                       : 2 టేబుల్ స్పూన్లు

బంగాళదుంపలు                     : 3

జీలకర్ర                                   : 1/2 టీ స్పూను

ఉడికించిన పచ్చిబఠానీలు        : 1/2కప్పు

తరిగిన పచ్చిమిరపకాయలు     : 2

ధనియాల పోడి                        : 1/2 టీ స్పును

గరంమసాలా                           : 1/2 టీ స్పును

ఆమ్ చూమ్                            : 1/2టీ స్పును

కారం                                      : తగినంత

ఉప్పు                                       : తగినంత

కొత్తిమీర                                  : కొద్దిగా

నూనె                                      : డీప్ ఫ్రైకి సరిపడ

తయారుచేసే విధానము:

ముందు బంగాళదుంపలను ఉడక బెట్టి మాష్ చేసి పెట్టుకోవాలి. ఓ పెద్ద కప్పులో మైదా, నూనె, తగినంత ఉప్పువేసి నునె పిండిలో బాగా కలిసేవరకు కలుపుతూ... నీరుపోస్తూ చపాతీ పిండిలా కలిపి పదిహేను నిముషాల పాటు మూతపెట్టి వుంచండి. ఈలోగా ఆలులోఉడికించిన పచ్చి బటాణి, ఉప్పు, కారం, జిర, ధనియాల పొడి, ఆమ్ చూమ్ పొడి, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన కొత్తిమిర అన్ని వేసి కలపాలి. ఓరెండు టేబుల్ స్పూన్ మైదాలో నీళ్ళు పోసి పల్చగా రవ్వదోశకి కలిపినట్టు పల్చగా వుండాలి. ఇపుడు కలిపిన మైదాపిండి ముద్దను కమలాపండు సైజు వచ్చేంతవరకు బాగా మర్దించాలి.

తర్వాత ఆ ముద్దను తీసుకుని చపతిలా వత్తు కోవాలి. ఆ చపాతీమీద. ఆలుకుర అరచేతి మందంలో పరిచి అన్నివైపుల అనిగెట్టు చేత్తోవత్తాలి. తరువాత అప్పడాలకర్రతో కూరని నెమ్మదిగా వత్తితే బాగా అనుగుతుంది. అపుడు చపాతీని చాపలా కాజాలకి చుట్టినట్టు చుట్టుకుని ఆఖరి అంచుకి తడి చేసి అంటిస్తే వుడిపోదు. అపుడు అరించి సైజులో కత్తితో ముక్కలుగా కోయాలి కాజాలమాదిరి, కోసినవి చేత్తోకాస్త నొక్కి గుండ్రంగా వత్తి, పల్చగా కలిపినా మైదాలోముంచి నూనెలో మీడియం హీట్ లో వేయించాలి. కర కరలాడుతూ చాలా బాగుంటాయి. రుచికి మాత్రం ధోకలేదు.