Read more!

Methi laddu

 

 

 

మెంతి లడ్డూ

 

 

సాధారణంగా మెంతులను వంటలలో చాలా తక్కువ వాడుతుంటాం. ఎందుకంటే అవి చేదుగా ఉంటాయి కాబట్టి. కానీ మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సో వాటిని తినాలన్నా కష్టంగా ఉంటుంది కాబట్టి వాటితో లడ్డూలు చేసుకొని తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మనకు సొంతమవుతుంది.

 

కావలసిన పదార్ధాలు:

* మెంతులు                     - 1/2కప్పు

* పాలు                           - 2కప్పులు

* గోధుమపిండి                 - 1/4కిలో

* నెయ్యి                          - 1కప్పు

* బెల్లం లేదా పంచదార       - 4కప్పులు

* జీడిపప్పు, ద్రాక్ష               - 1/2కప్పు

 

తయారు చేసే విధానం:

* ముందుగ మెంతుల్ని పొడి చేసి ముందు రాత్రి పాలల్లో బాగా నానా పెట్టుకోవాలి. (రాత్రంతా మెంతి పొడిని నానపెట్టడం వలన చేదు ఉండదు)

* ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి పాలు మెంతి పొడిని కలిపి నేతిలో వేసి ఎర్రగా వేయించాలి.

* తరువాత మరో బాణలిలో నెయ్యి వేసి గోధుమపిండిని కూడా వేయించాలి.

* ఇప్పుడు మెంతి పిండిలో గోధుమపిండి, బెల్లం లేదా పంచదార, వేయించిన జీడిపప్పు, ద్రాక్ష, మిగతా నెయ్యి వేసి లడ్డులా చుట్టుకోవాలి. అంతే మెంతి లడ్డూలు రేడి. వీటిని చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.