Read more!

Jangri Recipe

 

 

జాంగ్రీలు 

 

 

కావలసినవి:

మినపపప్పు  - ఒక  కప్పు

బియ్యం - ఒక కప్పు

పంచదార - రెండు కప్పులు

రోజ్ వాటర్ - ఒక స్పూను 

ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు

నూనె - తగినంత 
 

తయారుచేసే విధానం:

ముందుగా మినపపప్పు, బియ్యం కలిపి కడిగి నీళ్లుపోసి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్ల నుండి తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఉండాలి. ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఒక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి తీగ పాకం పట్టుకోవాలి. అలాగే బాణలిలో నూనె వేడి చేయాలి.  తరువాత మందపాటి బట్టకు రంధ్రం చేసి టాకా కుట్టు కుట్టుకుని పిండి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడి నూనెలో జిలేబీల్లా కాకుండా రెండు వరసలు చుట్టుకుని మధ్యస్థమైన వేడిలో వేయించుకుని తీసి గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలి. ఇందులో రోజ్ వాటర్ కూడా కలుపుకోవాలి. జాంగ్రీలు పాకం పీల్చుకున్న తర్వాత తీసి పళ్ళెంలో పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన జాంగ్రీలు రెడీ.