Gulab Phirni (Ramadan Special)
గులాబ్ ఫిర్నీ
కావలసిన పదార్థాలు:
పాలు - నాలుగున్నర కప్పులు
బాస్మతీ రైస్ - అరకప్పు
చక్కెర - ఎనిమిది చెంచాలు
రోజ్ వాటర్ - రెండు చెంచాలు
యాలకుల పొడి - అరచెంచా
బాదం పేస్ట్ - ఒక చెంచా
తయారీ విధానం:
బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నీటిలో నానబెట్టి ఉంచాలి. తరువాత కొద్ది చెంచాల పాలతో కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టౌ మీద పెట్టి పాలు పోయాలి. పాలు బాగా మరిగిన తరువాత బియ్యపు పేస్ట్, బాదం పేస్ట్ వేయాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ మీడియం మంట మీద ఉడికించాలి. ఉడికి చిక్కగా అయ్యిన తరువాత చక్కెర, రోజక వాటర్ వేసి కలపాలి. చక్కెర కరిగిపోయి, మిశ్రమం గిన్నెను వదులుతున్నప్పుడు దించేసుకోవాలి. కొన్ని బాదం పలుకులు, గులాబి రేకులు వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది.
- Sameera
Recommended for you
