Goduma Ravva Vadiyalu
గోధుమరవ్వ వడియాలు
కావలసిన పదార్థాలు :
గోధుమరవ్వ - రెండు కప్పులు
నీళ్లు - పది నుంచి పన్నెండు కప్పులు
పచ్చిమిర్చి పేస్ట్ - మూడు చెంచాలు
ఉప్పు - తగినంత
ఇంగువ - చిటికెడు
తయారీ విధానం:
ఓ బౌల్ లో నీళ్లు తీసుకుని, ఉప్పు వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు తిరగబడుతున్నప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాసేపు మరిగించాలి. తర్వాత గోధుమ రవ్వ వేసి మూత పెట్టాలి. రవ్వ మెత్తగా ఉడికిపోయేవరకూ సన్నని మంట మీద ఉడికించాలి. చివరగా ఇంగువ వేసి కలిపి దించేయాలి. ఓ ప్లాస్టిక్ షీట్ మీద ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడియాల్లాగా వేసి ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తర్వాత తీసి దాచుకోవాలి.
- Sameera
Recommended for you
