Coconut Rice Pudding
కోకోనట్ రైస్ పుడ్డింగ్
కావలసిన పదార్థాలు:
పచ్చికొబ్బరి తురుము - అరకప్పు
కొబ్బరి పాలు - అరలీటరు
బియ్యం - ఒక కప్పు
చక్కెర - అరకప్పు
పాలు - అరకప్పు
యాలకుల పొడి - చిటికెడు
తయారీ విధానం:
అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు, బియ్యం, చక్కెర, రెండు కప్పుల నీళ్లు వేసి స్టౌ మీద పెట్టాలి. బియ్యం సగం ఉడికిన తరువాత సిమ్ లో పెట్టేయాలి. బియ్యం మెత్తగా ఉడికిపోయి, మిశ్రమం క్రీమీగా తయారైన తరువాత కొబ్బరి పాలు వేసి కలిపి మూత పెట్టేయాలి. అప్పుడప్పుడూ కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా అవుతున్నప్పుడు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. మొత్తమంతా బాగా ఉడికిపోయి, దగ్గరగా అయిపోయిన తరువాత దించేసుకోవాలి. నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు వేసుకుని తింటే ఈ ఫుడ్డింగ్ చాలా బాగుంటుంది. కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు.
- Sameera
Recommended for you
