Read more!

Chocolate Heart Cookies

 

 

 

 

చాక్లెట్ హార్ట్ కుకీస్

 

 

కావలసిన పదార్థాలు:

బటర్  - 100 గ్రా

మైదా - 200 గ్రా

పొడిచేసిన పంచదార  - 100 గ్రా

తయారు చేసే విధానం:

చాక్లెట్ హార్ట్ కుకీస్ తయారుచేయటానికి ముందుగా  ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వెన్న, పంచదార వేసి బాగా కలపాలి. తరవాత మైదా వేసి, మళ్ళీ మిశ్రమం అంతా ఉండలు లేకుండా బాగా  కలిసేటట్టు కలపాలి.

ఇప్పుడు ఈ బౌల్ మీద మూతపెట్టి 15 నిముషాలు ఫ్రిజ్ లో ఉంచాలి. ఫ్రిజ్ నుండి బయటకు తీసాక, పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని, చపాతీలాగ వత్తుకొని, హార్ట్ షేప్ మౌల్డ్స్ ని గట్టిగా  వత్తి కట్ చేసుకోవాలి.

వీటి పైన ఇష్టమున్నవారు బాదాం, జీడిపప్పు చిన్నముక్కలగా చేసుకొని గార్నిష్ చెయ్యచ్చు.ఈ కుకీస్ ను నెయ్యిరాసి ఉంచుకున్న బేకింగ్ ట్రేలో ఉంచి, 200 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద, 10 నిముషాలు ఉంచి బేక్ చేసుకోవాలి.

బేక్ అయిన  తరవాత, బయటకు తీసి వాటి మీద చాక్లెట్ క్రీమ్ ని వేసి ప్రేమతో మీకిష్టమైన వారికి తినిపించచ్చు.

...కళ్యాణి

 

 

Recommended for you