Read more!

Bellam Ariselu (Sankranti Special)

 

 

 

బెల్లం అరిసెలు (సంక్రాంతి స్పెషల్)

 

 

కావలసిన పదార్ధాలు:-
తడి బియ్యంపిండి                          - 1 / 2 
బెల్లం                                              - 350 గ్రాములు 
నువ్వులు                                        - 2 చెంచాలు 
నూనె                                              - వేయించడానికి సరిపడా  

 

తయారీవిధానం :-

* బియ్యం కడిగి ఓ రాత్రి నానబెట్టుకుని ఉదయం చిల్లుల గిన్నెలో వాడేసి... నీళ్ళు బాగా వాడాక... బయట మిల్లులో కానీ ఇంట్లో మిక్సీ లో  గాని బాగా  మెత్తగా పట్టించుకోవాలి. 

* బియ్యంపిండిని తడి ఆరకుండా గిన్నెలో నొక్కి ప్రక్కన ఉంచుకుని... పొయ్యిమీద దళసరి గిన్నెలో బెల్లం తరుగులో నీరు పోసి.. ఉండపాకం వచ్చేవరకు కలిపి నువ్వులు వేసి కొద్ది కొద్దిగా  వరి పిండి వేస్తు ఉండలు లేకుండా మొత్తం పిండి పాకంలో కలిసేలా కలుపుకొని .. పిండి ఉండలు చేసే విధంగా కలుపుకొని ప్రక్కన ఉంచుకోవాలి. 

* ఇప్పుడు నూనె వేడిచేసుకుని... ఈ పిండిని ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ కవరుమీద అరిసెలా చేతితో నున్నగా వత్తుకుని నూనెలోకి వదలాలి... అలా చేసి రెండు వైపులా దోరగా వేగాక.... రెండు చిల్లుల గరిటెల మధ్య అరిసెను గట్టిగా నొక్కితే నూనె మొత్తం బయటికివస్తుంది... టిష్యు పేపరులపైకి అరిసెను తీసేసుకోవాలి.. చాలా రుచిగా ఉండే అరిసెలు ఇలా తయారుచేసుకోవాలి.