మళ్లీ మెలోడీ మ్యాజిక్!

Publish Date:May 20, 2026

Advertisement

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా చివరి దశలో ఇటలీ రాజధాని రోమ్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో మోదీ జరిపిన తాజా సమావేశం అంతర్జాతీయ దౌత్య ప్రాధాన్యతతో పాటు సోషల్ మీడియాలో సరికొత్త సంచలనానికి వేదికైంది. ప్రధాని మోదీ ఇటలీ ప్రధానికి భారతదేశానికి చెందిన ప్రముఖ ‘మెలోడీ’ టాఫీలను అంటే మెలోడీ చాక్లెట్లను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు  సంబంధించిన వీడియో నెట్టింటతెగ వైరల్ అవుతోంది.  

ద్వైపాక్షిక చర్చలకు ముందు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన   ప్రత్యేక సమావేశంలో మోదీ   మెలోనికి ఒక ప్యాకెట్ మెలోడీ చాక్లెట్లను బహుమతిగా అందించారు. దీనిపై ఇటలీ ప్రధాని స్పందిస్తూ..  సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఒక ప్రత్యేక వీడియో  పంచుకున్నారు. అందులో ఆమె స్పందిస్తూ  ప్రధాని మోదీ మాకోసం ఎంతో రుచికరమైన మెలోడీ టాఫీలను గిఫ్ట్‌గా తెచ్చారు అని నవ్వులు చిందిస్తూ..   "ధన్యవాదాలు చెప్పారు.  

గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికల్లో మోదీ, మెలోని పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన మెలోడీ (‘#Melodi’) అనే ట్రెండ్‌ను ఈ తాజా సంఘటన మరోసారి గుర్తుకు తెచ్చింది. భారతదేశంలో దశాబ్దాలుగా ఎంతో ఆదరణ పొందిన పార్లే సంస్థకు చెందిన మెలోడీ చాక్లెట్ల స్లోగన్ ఆధారంగా నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో  సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.  దౌత్యపరమైన ఈ సరదా సన్నివేశం ఇరు దేశాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రోమ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీకి అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం నుండి కూడా ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధాని మెలోని ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొన్న మోదీ, అనంతరం ఆమెతో కలిసి రోమ్‌లోని చారిత్రాత్మక కొలోసియం కట్టడాన్ని సందర్శించారు. 

By
en-us Political News

  
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.
మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు
2034 నాటికి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం..
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
విజయవాడ వేదికగా సోమవారే నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ఇండియా అమెరికాకు మిత్రదేశమనీ, కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం భరోసా ఇచ్చే ప్రకటన కావచ్చునేమో కానీ, పాలనా చర్యల విషయానికి వస్తే, అమెరికా భారత జనాభాకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అమెరికాలోని భారత జనాభా భారతదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించే ఇటీవలి ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం.
వరంగల్ రేంజ్‌కు చెందిన ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిపై ఉక్కుపాదం మోపారు.
ఇరుపక్షాలు 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించనున్నాయి.
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న సూలూరులో ఒక 10 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన కిరాతక అత్యాచారం మరియు హత్య ఉదంతం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.