విద్యార్థుల డ్రాపవుట్స్‌పై దృష్టిపెట్టండి...డీఈవోలతో మంత్రి లోకేష్

Publish Date:May 20, 2026

Advertisement

 

రాష్ట్రంలో పాఠశాల విద్య వాస్తవ స్థితిగతులు, మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నారా లోకేష్ జిల్లాలవారీగా డీఈవోలు, ఏపీసీలు, రాష్ట్రస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టాల్సి ఉంది. స్కూళ్లవారీగా ఇన్ ఫ్రాను అభివృద్ధి చేసి స్టార్ రేటింగ్ మెరుగుపర్చాలని మంత్రి లోకేష్ సూచించారు. 

తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్ స్పందిస్తూ... మనబడి మన భవిష్యత్తులో 75 పాఠశాల గదులను సిద్ధం చేశామని చెప్పారు. చంద్రగిరి, శ్రీకాళహస్తి, గూడూరు ఎమ్మెల్యేలు పదోతరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సహకాలు అందించారు. పదోతరగతి పరీక్షలు రాసిన 8,500 మందిలో 2వేల మందికి 500 మార్కులకు పైగా వచ్చాయి. వచ్చే ఏడాది 4వేలమంది 500మార్కులు అధిగమించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

విశాఖలో డ్రాపవుట్స్ పై దృష్టిపెట్టండి

విశాఖ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో 12శాతం విద్యార్థులు డ్రాపవుట్ ఉండటంపై మంత్రి లోకేష్ ఆందోళన వ్యక్తంచేశారు. అర్బన్ లో అడ్మిషన్లపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. తమ జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి మైగ్రేషన్ ఎక్కువగా ఉన్నందున డ్రాపవుట్స్ అధికంగా ఉన్నాయని విశాఖపట్నం డీఈవో ఎన్ ప్రేమ్ కుమార్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ డ్రాపవుట్స్ విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా ఆర్ జేడీ, డీఈవోలను మంత్రి లోకేష్ ఆదేశించారు. 

టీచర్ ఎన్ రోల్ మెంట్ పై శ్రద్ధ పెట్టండి

కృష్ణా జిల్లా పరిధిలోని పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం ఎక్కువగా డ్రాపవుట్స్ ఉన్నాయి, ఆరు మండలాల్లో టీచర్ ఎన్ రోల్ మెంట్ తక్కువగా ఉంది, అక్కడ ఎక్కువగా శ్రద్ధ వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు లీప్ యాప్ డౌన్ లోడ్ చేసుకునే విధంగా చైతన్యపర్చాలని సూచించారు. 

దీనిపై కృష్ణా జిల్లా డీఈవో యూవీ సుబ్బారావు స్పందిస్తూ... ఈ ఏడాది ప్రైవేటు నుంచి గవర్నమెంటుకు 8.1శాతం ట్రాన్సిషన్ జరిగింది. పదోతరగతి ఫలితాలపై ఇచ్చిన ప్రకటన ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ కు ఉపయోగపడుతోంది. అల్పాదాయ వర్గాల వారిని చైతన్యవంతం చేస్తున్నాం. టీచర్లు డోర్ టు డోర్ కాంపెయిన్ చేస్తున్నారు. నెవర్ ఎన్ రోల్డ్ 12,024, డ్రాపవుట్స్ 3,996 ఉన్నారు. సీఆర్ పీలతో క్షేత్రస్థాయిలో గుర్తించి ఎడ్యుకేట్ చేస్తున్నామని తెలిపారు.

ప్రత్యేక శిక్షణతో పదిలో మంచి ఫలితాలు

గుంటూరు జిల్లాలో జీఎఫ్ ఎల్ఎన్ లో హెచ్చుతగ్గులు ఉన్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. 78శాతం స్కూళ్లు జీరో నుంచి 2స్టార్ రేటింగ్ లో ఉన్నాయి, దీనిపై దృష్టిపెట్టాలని కోరారు. గుంటూరు డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ...సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ ద్వారా మెటీరియల్ ప్రిపేర్ చేయిస్తున్నాం, టెస్త్ పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాం. టెన్త్ లో తమ జిల్లాలో ఈ ఏడాది 1,457 మందికి 550కి పైగా మార్కులు వచ్చాయి. 10వేలమందికి హ్యాండ్ రైటింగ్ పై శిక్షణ ఇచ్చామని తెలిపారు.

కడపలో జూన్ నుంచి మరో 33 స్మార్ట్ కిచెన్లు

కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరులో డ్రాపవుట్స్, నెవర్ ఎన్ రోల్డ్ ఎక్కువగా ఉన్నాయి, వాటిపై దృష్టిపెట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. కడప డీఈవో షంషుద్దీన్ మాట్లాడుతూ... ఇప్పటికే 5 స్మార్ట్ కిచెన్లు పనిచేస్తున్నాయి, జూన్ నుంచి మరో 33 స్టార్ట్ కిచెన్లు ప్రారంభిస్తాం. లీప్ యాప్ వెనుకబడి ఉన్న ప్రాంతాల్లో పేరెంట్స్ ను చైతన్యవంతం చేస్తున్నాం. టెన్త్ లో ఒక విద్యార్థినికి అత్యధికంగా 595మార్కులు, మరో విద్యార్థినికి 592 వచ్చాయి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తమ పరిధిలోని 52 స్కూళ్లలో ప్రతిభ కనబర్చిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారని తెలిపారు. 

అకడమిక్ రేటింగ్ పై దృష్టిపెట్టండి

శ్రీకాకుళం జిల్లాపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ... ఎకడమిక్ స్టార్ పర్సంటేజీపై ఫోకస్ పెట్టాల్సిందిగా సూచించారు. వన్ క్లాస్ వన్ టీచర్ ఇచ్చాక గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ సంతృప్తికరంగా లేకపోవడాన్ని మంత్రి లోకేష్ ఆరాతీశారు. శ్రీకాకుళం డీఈవో రవిబాబు మాట్లాడుతూ... శ్రీకాకుళం జిల్లా పదోతరగతిలో మంచి పనితీరు కనబర్చామని, టెన్త్ రిజల్ట్ లో 14వస్థానం నుంచి 5వస్థానానికి చేరామని చెప్పారు.  


 

By
en-us Political News

  
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం..
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
విజయవాడ వేదికగా సోమవారే నిర్వహించిన ప్రతిష్టాత్మక వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సరికొత్త దిశను చూపించింది. ఈ సదస్సులో రాష్ట్రం నలుమూలల నుంచి 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు భాగస్వామ్యులయ్యారు.
ద్రవిడ రాజకీయల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇంగ్లండ్ మాజీ లెజెండరీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ నిర్వహించిన ఒక ప్రసిద్ధ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న వైభవ్.. అక్కడ పీటర్సన్ విసిరిన ఊహించని సవాల్‌ను స్వీకరించాడు. ఆ షోలో వైభవ్ సూర్యవంశీ పాతిక బంతుల్లోనే 100 పరుగులు బాది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న పంటలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ఇండియా అమెరికాకు మిత్రదేశమనీ, కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం భరోసా ఇచ్చే ప్రకటన కావచ్చునేమో కానీ, పాలనా చర్యల విషయానికి వస్తే, అమెరికా భారత జనాభాకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంటోంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అమెరికాలోని భారత జనాభా భారతదేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించే ఇటీవలి ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం.
వరంగల్ రేంజ్‌కు చెందిన ఏసీబీ అధికారులు మరో అవినీతి అధికారిపై ఉక్కుపాదం మోపారు.
ఇరుపక్షాలు 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించనున్నాయి.
తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న సూలూరులో ఒక 10 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన కిరాతక అత్యాచారం మరియు హత్య ఉదంతం
తెలంగాణలో మద్యం ప్రియులు సరికొత్త నిర్ణయంతో వార్తల్లోకెక్కారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో జరిగిన ప్రముఖుల, రాజకీయ నాయకుల హత్యల వ్యవహారం మరోసారి తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు రేగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.