ఏఐ ఎఫెక్ట్.. ఐదు నెలల్లో 92 వేల ఉద్యోగాలు హాంఫట్!
Publish Date:May 11, 2026
Advertisement
ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగాల కోత జోరుగా కొనసాగుతోంది. గడిచిన రెండేళ్లుగా సాగుతున్న ఈ లేఆఫ్స్ సెగ 2026లో మరింత ఎక్కువైంది. తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే అంటే 92 వేల మందికి పైగా టెక్కీలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. ప్రముఖ టెక్ కంపెనీల నుంచి స్టార్టప్‌ల మూడు వందలకు పైగా సంస్థలు ఉద్యోగుల తొలగింపు బాట పట్టాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు కాస్ట్ కంట్రోల్ పేర సిబ్బందిని భారీగా తొలగిస్తున్నాయి. కరోనా సమయంలో అవసరానికి మించి సిబ్బందిని నియమించుకోవడం.. ఇప్పుడు ఆర్థిక మందగమనం వల్ల తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దేందుకు సంస్థలు లేఆఫ్ బాట పట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత అందుబాటులోకి రావడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీపై పెట్టుబడులు పెంచుతూ, మానవ వనరుల వినియోగాన్ని తగ్గించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ పనులను ఏఐ టూల్స్ సులభంగా చేయగలుగుతుండటంతో.. టెక్ సంస్థలు ఉద్యోగాల తొలగింపు చేపడుతున్నాయి. ఈ లేఆఫ్ పరంపర మరి కొంత కాలం సాగే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/92thousand-jobs-vanished-36-219494.html





