బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు
Publish Date:May 12, 2026
Advertisement
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఓ మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి వివరాలను POCSO చట్టం ప్రకారం గోప్యంగా ఉంచినట్లు తెలిపారు. ప్రాథమికంగా ఈ కేసును భారతీయ న్యాయ సంహిత (BNS)తో పాటు POCSO చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదు చేసిన పోలీసులు.. అనంతరం బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా కేసును POCSO చట్టం సెక్షన్ 5(L) చదవబడిన సెక్షన్ 6 కిందకు మార్చినట్లు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా బండి సాయి భగీరథ్‌తో పాటు సంబంధిత వ్యక్తులు మే 13న మధ్యాహ్నం 2 గంటలలోపు విచారణాధికారి ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులను పట్టించుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇది ఇలా ఉండగానే ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ భగీరథ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉండగా.. పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఘటన రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
http://www.teluguone.com/news/content/seat-notices-for-bandi-bhagirath-36-219584.html





