సనత్‌నగర్ మైనర్ బాలుడి హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష
Publish Date:May 12, 2026
Advertisement
హైదరాబాద్ నగరాన్ని 2023లో కుదిపేసిన సనత్‌నగర్ మైనర్ బాలుడి హత్య కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ (33)కు మరణ శిక్ష విధించగా, సహనింది తుడు మహమ్మద్ రఫీక్ (32)కు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. సనత్‌నగర్ పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్‌గా మారినప్పటికీ, కేవలం సాంకేతిక ఆధారాలు మరియు పరిస్థితుల ఆధార సాక్ష్యాలతో కేసును ఛేదించారు. మొబైల్ కాల్ డేటా రికార్డులు, లొకేషన్ ట్రాకింగ్, ఇతర డిజిటల్ సాక్ష్యాలను సేకరించి నిందితుల పాత్రను నిర్ధారించారు. ప్రాసిక్యూషన్ కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తూ సాంకేతిక సాక్ష్యాలు, పరిస్థితుల ఆధార సాక్ష్యాలను పకడ్బందీగా సమర్పించ డంతో నిందితులపై ఆరోపణలు రుజువయ్యాయి. ఈ కేసును విచారించిన 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం. వెంకటేశ్వర రావు, నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ప్రధాన నింది తుడికి మరణశిక్ష విధించారు. కేసులో సహకరించిన మహమ్మద్ రఫీక్‌కు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. ఈ తీర్పు నగరంలో సంచలనం రేపుతోంది. పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వ యంతో కేసును విజయ వంతంగా ఛేదించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి
http://www.teluguone.com/news/content/accused-sentenced-to-death-in-sanathnagar-minor-boy-murder-case-36-219587.html





