రైల్ రోకో కేసులో కవితకు సమన్లు....రేపు కోర్టుకు హాజరు
Publish Date:May 12, 2026
Advertisement
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో నిర్వహించిన రైల్ రోకో కేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితకు కోర్టు సమన్లు జారీ చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్ సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి జారీ అయిన సమన్లలో, బుధవారం ఉదయం 10.30 గంటలకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. రైల్వే చట్టం కింద నమోదైన కేసులో విచారణ కోసం ఈ సమన్లు జారీ చేయడం జరిగింది. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో కవిత ఆధ్వర్యం లో రైల్ రోకో నిర్వహించారు తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి కేంద్రానికి పంపిన బీసీ బిల్లులకు వెంటనే ఆమోదం తెలపా లని ఈ కార్యక్రమం చేపట్టారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైల్ రోకోలో పాల్గొన్న కవితతో పాటు టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రైల్ రోకో కారణంగా రైల్వే రాకపోకలు ప్రభావితమ య్యాయి. సిర్నపల్లి – ఇందల్వాయి మధ్య నిజామాబాద్–హైదరాబాద్ దేవగిరి ఎక్స్‌ప్రెస్ నిలిపివేయ బడింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మరో గూడ్స్ రైలు కూడా ఆపబడింది. కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కవితతో పాటు మరో 12 మంది టీఆర్ఎస్ నాయ కులపై కేసులు నమోదు చేశారు. రైల్వే ఆక్ట్ 147 & 174(a) కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేయడంతో, రేపు సికింద్రా బాద్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/summons-to-kavitha-in-the-rail-roko-case-36-219558.html





