నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు...బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Publish Date:May 12, 2026
Advertisement
నిజాయితీగా బయటకు వస్తాని చెప్పాడు.. నాదే తప్పు నా కొడుకుకి టైమ్ ఇవ్వలేదు.. కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసిన ఆయన, తన కుమారుడు నిజాయితీగా బయటకు వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. తన కుమారుడికి సమయం ఇవ్వకుండా తానే ముందుగా మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. తన కుమారుడిని క్రిమినల్‌గా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుక్కి ఒక రకమైన చట్టం ఇంకొకరికి మరొక రకమైన చట్టం ఉండదు... “నా కొడుకు తప్పు చేసి ఉంటే శిక్ష పడుతుంది. తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే” చట్టం ఎవరికి చుట్టం కాదు... అని ఆయన స్పష్టం వ్యక్తం చేశారు. తన కుటుంబంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.తన భార్య తీవ్రంగా బాధపడుతోందని, డిప్రెషన్‌లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. “నేను వెళ్తున్న దారిలోనే నా భార్య వస్తోంది… ఆమె ఏడుస్తోంది” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.ఈ వ్యవహారంలో కుట్రలు జరిగాయని ఆరోపించిన ఆయన, బాధ్యుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.“ఆంజనేయుడు పెట్టిన నిప్పు లంకను దహనం చేసినట్టు అవినీతి వ్యవస్థను దగ్ధం చేస్తాను. తెలంగాణ మొత్తం తిరుగుతాను” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి స్టేట్మెంట్ అనంతరం పోలీసులు కేసు సెక్షన్లను మార్చారు. మరోవైపు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యవహారాన్ని 'బేటా బచావో' అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉండటంపై ఆయన ప్రశ్నలు సంధించారు. అయితే, ఇవన్నీ తనపై జరుగుతున్న 'పొలిటికల్ హిట్ జాబ్' అని, వెనుకబడిన వర్గానికి చెందిన నేత ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక చేస్తున్న ఆరోపణలని బండి సంజయ్ తిప్పికొట్టారు. ముందుగా నమోదైన BNS సెక్షన్లు 74, 75పోక్సో యాక్ట్ సెక్షన్ 11 ను మార్చి, ఇప్పుడు పోక్సో యాక్ట్ సెక్షన్ 5(1) రీడ్ విత్ 6 నమోదు చేసినట్లు సమాచారం....ఈ మార్పు కేసు తీవ్రతను పెంచినట్లు తెలుస్తోంది
http://www.teluguone.com/news/content/bandi-sanjay-36-219586.html





