ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడిన యువతి!

తనను ప్రేమించి పెళ్లాడడానికి సిద్ధపడిన తన ప్రియుడు పరువుహత్యకు గురికావంతో ఓ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. మరణించినా సరే తన ప్రియుడితోనే తన వివాహమని తెగేసి చెప్పింది. అలాగే చేసింది. ఇక తన జీవితమంతా తన ప్రియుడి కుటుంబంతోనే కలిసి జీవిస్తానని స్పష్టం చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.  

వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతో  ఆ యువతి కుటుంబ సభ్యులు ప్రియుడిని   హత్య చేశారు. దీంతో ఆ యువతి అతడినే పెళ్లాడతానని పట్టుబట్టి, మరణించిన తన ప్రియుడి అంత్యక్రియల సమయంలో అతడి మృతదేహంతోనే వివాహం చేసుకుంది.  

నాందేడ్‌‌‌‌‌‌‌‌ కు చెందిన అంచల్   సక్షం టేట్ లు గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో అంచల్ తండ్రి వీరి వివాహానికి అడ్డు చెప్పడమే కాకుండా.. తన మాట వినకుండా ఇంకా అంచల్ తో ప్రేమ కొనసాగిస్తున్నాడన్న ఆగ్రహంతో సక్షం టేట్ ను అంచల్ సోదరులతో కలిసి  హత్య చేశారు. విషయం తెలిసి అంచల్​  సక్షం అంత్యక్రియలు జరుగుతుండగా అతడి ఇంటికి చేరుకుని అతడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది. సక్షం టేట్ భార్యగా జీవితాంతం అతడి ఇంట్లోనే నివసిస్తానని కుండబద్దలు కొట్టింది. తన ప్రేమ గెలిచిందనీ, సక్షం టేట్ ను దారుణంగా హత్య చేసిన తన తండ్రి, సోదరులు ఓడిపోయారనీ అంచల్ అంటోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu