మహిళల్లో పెరుగుతున్న సంతానలేమి సమస్యలు

 

రోజులు మారుతున్నాయ్. జనం లైఫ్ స్టైల్ కూడా మారుతోంది. అందుకు తగ్గట్లుగానే.. సమస్యలు కూడా వస్తున్నాయ్. మోడ్రన్ లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, పబ్బులు, క్లబ్బుల్లో హ్యాంగ్ అవుట్‌లు, లేట్ నైట్ పార్టీలు, స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్ అడిక్షన్‌ల లాంటివి.. యువతరం భవిష్యత్తుని దెబ్బకొడుతున్నాయ్. దాంతో.. సరైన సమయంలో, సంతానం విషయంలో.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. చెడు వ్యసనాల కారణంగా.. అమ్మాయిలకు అమ్మతనం దూరమవుతోంది. ఇప్పుడు కంట్రోల్‌లో లేకపోతే.. ఫ్యూచర్‌లో ఇన్‌ఫెర్టిలిటీ సమస్యతో బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. 

అనవసరపు అలవాట్లే.. ఆడవాళ్లలో ఇన్‍‌ఫెర్టిలిటీ ఇష్యూస్ పెరగడానికి కారణమవుతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయ్. అమ్మ అవ్వాలనే ఆశ ఉంటే.. లైఫ్ స్టైల్ మార్పులు తప్పనిసరి అని చెబుతున్నారు గైనకాలజిస్ట్‌లు. అబ్బాయిలు సిగరెట్ తాగడం, మందుకొట్టడం.. ఈ జనరేషన్‌లో కామనైపోయింది. సిగరెట్, మద్యం అలవాటున్న అమ్మాయిలు కూడా కొన్నేళ్ల కిందటి వరకు అక్కడక్కడా అరుదుగా కనిపించేవారు. కానీ.. ఇప్పుడు అమ్మాయిల్లోనూ.. ఈ అలవాట్లు కామనైపోయాయ్. 

సాధారణంగా.. సౌత్ ఇండియా సిటీస్‌లో.. నార్త్ నుంచి వచ్చి కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళలు ఎక్కువగా స్మోక్ చేసేవారు. అది కూడా ఎవరూ చూడని, లేని ప్రదేశాల్లోనే సిగరెట్లు తాగేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. రోడ్డు పక్కన ఛాయ్, పాన్ షాప్‌ల దగ్గర అబ్బాయిలతో కలిసి.. వారితో పోటీగా దమ్ముకొడుతున్నారు. ఎవరేమనుకున్నా.. తమకు అవసరం లేదనే రీతిలో అమ్మాయిల ఆలోచనవిధానంలో మార్పులొచ్చాయ్. ఫ్రెండ్స్ బలవంతం మీదే అలవాటు చేసుకున్నామని చెప్పేవాళ్లు కొందరైతే.. స్టైల్‌గా ఉంటుందని స్మోక్ చేసే వాళ్లు ఇంకొందరు. 

డిప్రెషన్ నుంచి బయటపడేందుకే.. పొగ తాగడం అలవాటు చేసుకున్నామని మరికొందరు చెబుతున్నారు. అయితే.. అలవాటు ఏదైనా.. ఓ లిమిట్ దాటనంత వరకే బాగుంటుంది. మితిమీరితే.. ఆరోగ్య సమస్యల ముప్పు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు డాక్టర్లు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీకి.. తెలంగాణ నలుమూలల నుంచే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఉద్యోగాల కోసం అనేకమంది అమ్మాయిలు వస్తుంటారు. పీజీల్లో, హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాలు చేస్తుంటారు. అలా.. చాలామంది కార్పొరేట్ కల్చర్‌కి అట్రాక్ట్ అవుతున్నారు. సాఫ్ట్ ‌వేర్ కంపెనీల్లో జాబ్ చేస్తూ.. సోషల్‌గా ఇతరులతో మింగిల్ అయ్యేందుకు చెడు అని నిపుణులు సూచిస్తున్నారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu