ఐదేళ్ల చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచిక దాడి!

అభంశుభం ఎరుగని ఐదేళ్ల చిన్నారిపై ఓ ఆయా పైశాచికంగా దాడి చేసింది. నిష్కారణంగా ఆమెను చితకబాదడమే కాకుండా మెడపట్టుకుని కుదిపేసింది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా పోలీసు స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లోని ఒ ప్రైవేట్ స్కూలులో జరిగింది.

ఆ పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఓ చిన్నారిపై ఆ స్కూల్ ఆయా అమానుషంగా దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది.  స్కూల్లో పనిచేస్తున్న ఆయా,  అదే స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారిపై జరిపిన దాడిలో ఆ చిన్నారి గాయపడటమే కాకుండా, భయంతో తీవ్ర జ్వరానికి గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

 స్కూల్  ఆయా ఆ చిన్నారిని కొడుతున్న దృశ్యాలను ఆ పాఠశాల పక్కనే ఉన్న ఓ ఇంటి పై అంతస్తు నుంచి ఓ యువకుడు తన ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ వీడియోను అతడు పోలీసులకు అందజేశాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న  పోలీసులు, చిన్నారిపై దాడిచేసిన ఆయాను విచారిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu