నిన్న అఖండ.. నేడు రాజా సాబ్.. షాక్ ల మీద షాక్ లు!
on Dec 6, 2025

అఖండ 2 వాయిదాతో షాక్ లో బాలయ్య ఫ్యాన్స్
రాజా సాబ్ విషయంలోనూ ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్, జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. వింటేజ్ ప్రభాస్ ని చూడటం కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. విడుదలకు ఇంకా నెల రోజులు కూడా సమయం లేదు. ఇలాంటి టైంలో బిగ్ షాక్ తగిలింది.
ఓవర్సీస్ లో 'ది రాజా సాబ్' మూవీపై డిసెంబర్ 19న విడుదలవుతున్న అవతార్-3 ఎఫెక్ట్ పడనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ 'రాజా సాబ్'ని నార్త్ అమెరికాలో విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఓ ట్వీట్ చేసింది. అవతార్-3, ఐమాక్స్ మధ్య కుదిరిన నాలుగు వారాల ఒప్పందం కారణంగా.. రాజా సాబ్ చిత్రానికి ఐమాక్స్ ఫార్మాట్ ఉండదని తెలిపింది. అంతేకాదు, మిగతా ఫార్మాట్ లలో కూడా ప్రభాస్ స్టార్డమ్, మార్కెట్ కి తగినన్ని స్క్రీన్స్ దొరకకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్, అందునా నార్త్ అమెరికా మార్కెట్ కీలకం. స్టార్ హీరోల మెజారిటీ సినిమాలు అక్కడ భారీ వసూళ్లను రాబడుతున్నాయి. అందుకే తెలుగు స్టేట్స్ తర్వాత ఓవర్సీస్ మార్కెట్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు స్టార్స్. అలాంటిది ఇప్పుడు అవతార్-3 కారణంగా ఓవర్సీస్ లో తగినన్ని స్క్రీన్స్ అందుబాటులో లేకపోవడం.. ప్రభాస్ లాంటి బడా స్టార్ కి బిగ్ షాక్ అని చెప్పవచ్చు.
Also Read: దటీజ్ బాలయ్య.. నిజాయితీ అంటే ఇది..!
మరోవైపు, 'అఖండ-2'(Akhanda 2: Thaandavam) కొత్త విడుదల తేదీపై కూడా 'అవతార్-3' ప్రభావం కనిపిస్తోంది. 14 రీల్స్ ప్లస్, ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య నెలకొన్న ఫైనాన్షియల్ ఇష్యూ కారణంగా డిసెంబర్ 5న విడుదల కావాల్సిన 'అఖండ-2' వాయిదా పడిన విషయం తెలిసిందే. అన్ని సమస్యలు పరిష్కారమై డిసెంబర్ 12 కి విడుదలవుతుందా లేదా? అనేది సస్పెన్స్ లా మారింది. ఒకవేళ ఆ డేట్ మిస్ అయ్యి.. డిసెంబర్ 19 లేదా ఆ తరువాత విడుదల చేస్తే మాత్రం.. ఓవర్సీస్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మెజారిటీ థియేటర్లను 'అవతార్-3' ఆక్రమించుకుంటుంది. పోనీ సంక్రాంతికి రావాలనుకుంటే.. ఇప్పటికే ఆ సీజన్ పై పలు సినిమాలు కర్చీఫ్ వేసి ఉన్నాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 12కే విడుదల చేయాలనే ఆలోచనలో 'అఖండ-2' మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి తెలుగు సినిమాలు 'అఖండ-2', 'ది రాజా సాబ్'పై హాలీవుడ్ ఫిల్మ్ 'అవతార్-3' ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



