అమెరికాలో అగ్నిప్రమాదం .. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

 

అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన  అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో ఆయా ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ కంప్లెక్స్‌లో అలబామా యూనివర్శిటీలో చదువుకుంటున్న సుమారు 10 తెలుగు విద్యార్థులు నివాసముం టున్నారు. 

ఈరోజు ఉదయం బర్మింగ్‌ హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ కంప్లెక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు మొదలైన కొద్ది క్షణాల్లోనే దట్టమైన పొగలు ఆ అపార్ట్మెంట్ మొత్తాన్ని కమ్మేశాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ త్వరగా వ్యాపిస్తూ ఉండడంతో కాసేపటికే అపార్ట్‌మెంట్‌ను దట్టమైన పొగతో కమ్మేయడంతో అందులో నివాసం ఉంటున్న విద్యార్థులు శ్వాస తీసుకో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు భయంతో గట్టి గట్టిగా అరుస్తూ బయట పడేందుకు ప్రయత్నించారు. 

కానీ అప్పటికే అపార్ట్మెంట్ చుట్టూ దట్టమైన పొగ వ్యాపించ డంతో వారు లోపలే చిక్కుకుపోయారు. సమా చారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘ టనా స్థలానికి చేరుకుని లోపల చిక్కుకొని పోయిన వారందరినీ బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టింది. మొత్తం 13 మంది విద్యార్థులను రెస్క్యూ చేసి బయటకు తీసుకువచ్చిన అనంతరం ఫైర్ సిబ్బంది వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో తీవ్ర గాయాలైన ఇద్దరు విద్యార్థులు హాస్పి టల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

మృతుల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డి, మరో విద్యార్థి కూకట్‌పల్లి ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ అల బామా యూనివర్శిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తు న్నారు.ఈ ఘటనతో అమెరికాలో ఉన్న తెలుగు  విద్యార్థుల వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu