వివేకా హత్య కేసులో కీలక మలుపు
posted on Sep 16, 2025 3:11PM

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్దంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్లామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.మా వివేకానందరెడ్డి 2019 మార్చి 15న రాత్రి తన ఇంట్లో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.
అయితే ఈ హత్యపై అనేక ఆరోపణలు చేశారు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవిలపై ఆరోపణలు చేశారు. అంతేకాదు సీబీఐ డిమాండ్ సైతం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు టీడీపీ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు బృందాన్ని మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. సీబీఐ దర్యాప్తుపై వైఎస్ జగన్ వెనక్కి తగ్గారు. పోలీసు అధికారులను సైతం బదిలీ చేశారు. దీంతో వైఎస్ సునీతారెడ్డి కోర్టులలోపోరాడి చివరకు సీబీఐ విచారణ సాధించారు. దీంతో ఈ కేసు విచారణను సీబీఐ దర్యాప్తు చేపట్టింది.