విద్యుత్ ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి... రూ.2 కోట్ల నగదు సీజ్
posted on Sep 16, 2025 3:26PM
.webp)
హైదరాబాద్ నగరంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించడంతో తీవ్ర కలకలం రేపు తుంది. హైదరాబాద్ నగరంతోపాటు పలు చోట్ల ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు... మొత్తం పదిహేను బృందాలు సోదాలు చేస్తున్నట్లు సమాచారం....హైదరాబాద్ నగరం లోని గచ్చిబౌలీ మణికొండలో ఏసీబీ రైడ్స్ కొనసాగించారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏడిఈ గా పని చేస్తున్న అంబేద్కర్ అనే వ్యక్తి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు.భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లు కూడబెడుతున్నట్లు కొన్నేళ్లుగా అంబే ద్కర్ పై ఆరోపణలు వస్తున్నాయి..
చాలామంది బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం...ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు... ఇంకా సోదాలు కొనసాగుతునే ఉన్నాయి.అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రెండు కోట్ల రూపాయల నగదును అధికారులు పట్టుకున్నారు. అంబేద్కర్ బంధువులు,
బినామీల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు.ఏడిఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంబేద్కర్ ఇల్లు తో పాటు బినామీ ఇండ్లు మొత్తం కలిపి 18 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.అంబేద్కర్ పెద్ద ఎత్తున ఆస్తులతో పాటు వ్యవసాయ భూములు కొన్నాడు.ఆ భూముల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ ఏ చిన్న పని చేసినా కూడా లంచం డిమాండ్ చేసేవాడు. లంచం తీసుకోకుండా పనిచేసేవాడు కాదు ఇలా ప్రతి ఒక్కరి దగ్గర లంచం తీసుకునేవాడు.ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.