డిసెంబర్ కల్లా ఏపీలో గుంతలు లేని రోడ్లు!
posted on Sep 16, 2025 12:54PM
.webp)
ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆంధ్రప్రదేశ్ లోని రోడ్లన్నీ గుంతలు లేని రహదారులుగా మారిపోనున్నాయి. ఔను నిజమే ఈ విషయం చెప్పింది స్వయంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు. కలెక్టర్ల సదస్సులో భాగంగా సోమవారం (సెప్టెంబర్ 15) ఆయన రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రహదారులపై గంతలనేవీ లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పిన ఆయన.. ఈ లక్ష్య సాధనపై కలెక్టర్లందరూ దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 860 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో 19వేల కిలోమీటర్ల రోడ్లను గుంతల రహిత రహదారులుగా మార్చిందని వివరించారు. మరో 5, 946 కిలోమీటర్ల రోడ్లను గుంతల రహితదారులుగా మార్చడానికి రూ.500 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
అలాగే రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ ప్రధాన అవరోధంగా మారిందన్నారు. జిల్లాల్లో కలెక్టర్లు ఎ భూ సేకరణ సమస్యలపై శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్రంలో 89 జాతీయ రహదారి ప్రాజెక్టులకు సంబంధించి 850 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉందని చెప్పారు. ఈ భూ సేకరణ వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలన్నారు.