టీటీడీ అంటే ఆ కుటుంబానికి ఎందుకంత దుర్మార్గపు ఆలోచన?
posted on Nov 12, 2025 10:31AM

టీటీడీ మీద జగన్ ఫ్యామిలీ చేస్తున్న కుట్రలు ఈనాటివి కావు. ఒక సమయంలో వెంకటేశ్వరస్వామిని అనరాని మాటలు అన్న భూమన కరుణాకర్ రెడ్డిని ఏకంగా టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించడం దగ్గర్నుంచి మొదలు పెడితే ఈ పరంపర కొనసాగుతూనే వచ్చింది.
ఆ తర్వాత వెంకటేశ్వరస్వామికి వ్యతిరేకంగా పుస్తకాలు రాసిన భూమన సోదరుడు ఏకంగా శిక్షణా తరగతులు ప్రారంభించడం అదో భ్రష్టాచారంగా చెబుతారు.
ధర్మారెడ్డిని టీటీడీ పాలనలో ప్రవేశ పెట్టించి.. ఆయన చేత చేయించని అక్రమాలు లేవనడానికి పరకామణి, ఆపై లడ్డూలో నకిలీ నెయ్యి వ్యవహారాలు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీవారికి వైయస్ కుటుంబం చేయని ద్రోహం లేదని అంటారు.
ఇటీవల మాట్లాడిన భూమన తన వాళ్లు సుమారు ఐదు వేల మంది వరకూ టీటీడీలో పాతుకుపోయారనీ.. మీకు సంబంధించిన ఏ చిన్న రహస్యమైనా తన చేతికి వచ్చేస్తుందంటూ ఆయన మాట్లాడిన మాటలు ఒక సంచలనం.
అంటే అన్ని రకాలుగా టీటీడీని ఆక్రమించుకుని వారికి వారు దోచుకోడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించినట్టు కనిపిస్తోంది. పరకామణి వ్యవహారమే చూస్కుంటే ధర్మారెడ్డి ద్వారా అప్పట్లో ఎస్టేట్ మేనేజర్ గా ఉన్న ఒక వ్యక్తిని టీటీడీ అడిషనల్ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించి మరీ ఈ స్కామ్ కి తెరలేపినట్టు గుర్తించారు సీఐడీ అధికారులు.
నకిలీ లడ్డు వ్యవహారం ఎంత ఘోరమంటే.. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీ కోసం భోలే బాబా డైరీ నుంచి 250 కోట్ల విలువైన 68 లక్షల కేజీల నెయ్యి కొన్నారు. ఆ డైరీ 2019- 2024 మధ్య ఒక్క లీటర్ పాలు కూడా సేకరించలేదంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
కొందరనే మాటలను అనుసరించి చెబితే.. జగన్ కుటుంబానికి టీటీడీ మీద అక్కసు ఈనాటిది కాదని.. ఇది ఆయన తండ్రి వైయస్ ఏడుకొండల వాడికి ఏడు కొండలు ఎందుకు? రెండు కొండలు మాత్రమే సరిపోవా? అంటూ మొదలు పెట్టారనీ.
వైయస్ పావురాలగుట్టలో పడి అనంతలోకాలకు చేరినా ఈ పులివెందుల మాఫియాకు టీటీడీ మీదున్న దుర్మార్గపు ఆలోచనలు పోలేదనీ.. అందుకే జనాన్ని మభ్య పెట్టడానికని.. తన ఇంట్లో వెంకన్న సెట్ వేశారనీ.. ఈ బూటకాల నాటకం గుర్తించబట్టే వెంకన్న తన మూడు నామాలలోని రెండు నామాలను బహుమానంగా ఇచ్చారనీ చెప్పుకొస్తారు శ్రీవారి భక్తులు.