కుల్సుంపురా సీఐ సస్పెన్షన్ వేటు

 

హైదరాబాద్‌ నగర పోలీస్‌ వ్యవస్థలో కలకలం రేపుతున్న ఘటనలో కుల్సుంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ సునీల్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ సజ్జనార్‌  సస్పెండ్‌ చేశారు. ఒక కీలక కేసులో విచారణను ప్రభావితం చేస్తూ, నిందితుల పేర్లు ఉద్దేశపూర్వకంగా మార్చి మరో వర్గానికి అనుకూలంగా వ్యవహరించినట్లు వచ్చిన ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ప్రత్యర్థి వర్గం నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారు. కేసును డిస్టార్ట్‌ చేసి, వాస్తవ నిందితులను రక్షించే ప్రయత్నం చేశారన్న ఫిర్యాదులు కమిషనర్ కార్యాలయానికి చేరడంతో వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రాథమికంగా వచ్చిన నివేదికల్లో ఇన్స్పెక్టర్‌ చర్యలు డిపార్ట్‌మెంట్‌ నిబంధనలకు విరుద్ధమని ఉన్నాయని తేలడంతో సునీల్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు. 

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి శాఖా విచారణను కూడా ప్రారంభించినట్లు పోలీస్‌ అధికారులు వెల్లడించారు. ఈ సస్పెన్షన్‌తో కుల్సుంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. విధుల్లో అక్రమాలు, వర్గపోరు, అంతర్గత లావాదేవీలు బయటకు రావడంతో ఇతర అధికా రులు కూడా అప్రమత్త మయ్యారు.ఈ కేసు ఎటు తిరుగుతుందో, ఇన్స్పెక్టర్‌పై ఇంకా ఏ చర్యలు పడతాయో అన్న దానిపై పోలీస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu