హిందూ మతంపై కుట్రలు : విజయసాయిరెడ్డి

 

హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయని వాటిని సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. డబ్బు ఆశ చూపించి మత మార్పిడులకు వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గత రెండు దశాబ్ధాలుగా జరిగిన మతమార్పిడులపై ప్రభుత్వం కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. 

దేశం కోసం, ధర్మం కోసం హిందువులందరూ ఒక్కటవ్వాలి అదే భారతదేశానికి రక్ష..శ్రీరక్ష అని ఓ యాంకర్ మతమార్పిడులకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోను షేర్ చేశారు. హిందూ ధర్మం కోసం అన్ని సామాజిక వర్గాలు ఒకటి అవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో ఆయన బీజేపీకి చేరువయ్యేందుకు ఇలాంటి ట్వీట్ చేశారని కామెంట్స్ చేశారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu